ప్రొఫెసర్ అవతారం ఎత్తబోతున్న రష్మిక.. ఎవరి సినిమాలో అంటే!

యంగ్ బ్యూటీ రష్మిక క్రమంగా సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. ఇప్పటికే తెలుగు యువత రష్మిక పెర్ఫామెన్స్ కు ఫిదా అయ్యారు. ఛలో, గీత గోవిందం చిత్రాలలో ఈ భామ తన చూపులు, చలాకి నటనతో మాయ చేసింది. గీత గోవిందం చిత్రంలో అయితే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక కెమిస్ట్రీ అదిరిపోయింది. పెరిగిన క్రేజ్ తో రష్మికకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా రష్మిక ఓ కన్నడ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. యువ హీరో ధృవ్ సార్జా సరసన నటించబోతోంది. ధృవ్ సార్జా, రష్మిక జంటగా నటించే ఈ చిత్రానికి పొగరు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నంద కిషోర్ ఈ చిత్రానికి దర్శకుడు. రష్మిక నటించే ప్రొఫెసర్ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఓ వైపు గ్లామర్ పరంగా ఆకట్టుకుంటూనే.. నటన పరంగా కూడా రష్మిక మెప్పిస్తోంది.

Rashmika to romance with Kannada hero Dhruva Sarja

ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన మరోమారు నటిస్తోంది. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డియర్ కామ్రేడ్. మైత్రి మూవీస్ వాళ్ళు నిర్మిస్తున్నారు. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది కాకుండా నితిన్ సరసన కూడా ఓ చిత్రంలో రష్మిక నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X