TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ ఎంగేజ్మెంట్, సినిమాలు వదిలేశాక హ్యపీగా... (ఫోటోస్)
'లీడర్' సినిమా ద్వారా నటిగా కెరీర్ మొదలు పెట్టిన రీచా గంగోపాధ్యాయ్ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. నాగవళ్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి, భాయ్ చిత్రాల్లో నటించారు. అయితే 'భాయ్' సినిమా తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. తిరిగి తన స్వస్థలం అమెరికా వెళ్లిపోయారు.
తాజాగా రీచా గంగోపాధ్యాయ్ గురించిన ఓ గుడ్ న్యూస్. ఇటీవల ఆమె ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. జియో లాంజెల్లా అనే యువకుడిని ఆమె త్వరలో పెళ్లాడబోతున్నారు.
ఫోటో షేర్ చేసిన రీచా..
జియో లాంజెల్లాతో కలిసి దిగిన ఫోటోను కూడా రీచా తన అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. అయితే పెళ్లి తేదీ ఇంకా ప్రకటించలేదని, త్వరలోనే వెల్లడిస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఎలా పరిచయం అయ్యాడు?
జియో తనకు బిజినెస్ స్కూల్‌లో పరిచయం అయినట్లు రీచా గంగోపాధ్యాయ్ వెల్లడించారు. రెండు సంవత్సరాలు అతడితో డేటింగ్ చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపిన ఈ మాజీ హీరోయిన్ తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నట్లు సంతోషంగా తెలిపారు.
సినిమాలకు దూరమని తేల్చి చెప్పింది
ట్విట్టర్లో అభిమానులు తరచూ తనను మీ తర్వాతి సినిమా ఎప్పుడు? అని ప్రశ్నిస్తుండటంతో గతంలోనే ఆమె ఈ విషయంలో స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పారు. ట్విట్టర్ స్టేటస్ కూడా 'మాజీ నటి' అని మార్చుకుంది. అమెరికా పౌరసత్వం ఉన్న ఈ బ్యూటీ తాను ఎప్పటికీ మిచిగాన్ వాసినే... అదే సమయంలో ఇండియన్ అమెరికన్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను అని పేర్కొన్నారు.
అందుకే దూరమైందా?
సినిమా కెరీర్ కొంతకాలం మాత్రమే బాగుంటుంది. అభిమానులు నన్ను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నాకు ఇష్టమైన జీవితం వైపు వచ్చేశాను అని రీచా స్పష్టం చేశారు.
#మీటూ వల్ల కాదు...
#మీటూ అనుభవం వల్లనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అని ఒకరు ప్రశ్నించగా 'మీటూ' అనుభవం తనకు ఎదురు కాలేదన్నారు. అవకాశాల కోసం ఎప్పుడూ తప్పుడు దారిలో వెళ్లలేదని తెలిపారు.