Who is Ritika Nayak? తేజా సజ్జాతో రొమాన్స్.. మిరాయ్ హీరోయిన్‌ రితికా నాయక్ గురించి తెలుసా?

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం మిరాయ్. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రీయా శరణ్‌లు కీలకపాత్రలు పోషించారు. అయితే ప్రస్తుతం అందరి చూపూ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రితికా నాయక్ మీదే పడింది. తన క్యూట్ లుక్స్‌తో విడుదలకు ముందే ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఈ నేపథ్యంలో రితికా నాయక్ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటీ? ఈ వివరాల్లోకి వెళితే..

మిరాయ్ బడ్జెట్ ఎంత?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ మిరాయ్ చిత్రాన్ని నిర్మించారు. మంచు మనోజ్, శ్రీయ సరన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులతో కలిపి మిరాయ్‌కి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ అంచనాల నేపథ్యంలో తేజ సజ్జా మూవీకి థియేట్రికల్, శాటిలైల్, ఓటీటీ, ఆడియోతో కలిపి దాదాపు 85 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ టాక్.

Ritika Nayak do you know about Teja Sajja s Mirai actress

టాలీవుడ్‌లో ఎంట్రీ
27 అక్టోబర్ 1997లో ఢిల్లీలో జన్మించింది రితికా నాయక్‌. శ్యామ ప్రసాద్ ముఖర్జీ కాలేజీ ఫర్ ఉమెన్‌లోగ్రాడ్యుయేషన్ చేశారు. వీరిది ఢిల్లీలో స్థిరపడిన ఒడియా కుటుంబం. చదువుల్లో టాపర్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. ఆపై మోడలింగ్‌లో దిగి 2019లో ఢిల్లీలో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 12వ సీజన్‌లో విజేతగా నిలిచారు. ఆ తర్వాత సినీరంగం వైపు అడుగులు వేసిన రితికా సింగ్‌ టాలీవుడ్‌తోనే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలుత విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించారు. ఇందులో వసుధగా ఆమె అద్భుతంగా నటించారు. ఇందుకు గాను సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ కేటగిరీలో అవార్డ్ అందుకున్నారు

రితిక డైరీ ఫుల్
అనంతరం నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన హాయ్ నానిలోనూ రితిక గెస్ట్ రోల్ పోషించారు. ఈ క్రమంలోనే ఆమెకు మిరాయ్‌లో అవకాశం దక్కింది. ఈ సినిమాతో పాటు డ్యూయెట్, వీటీ 15 చిత్రాల్లో రితికా నాయక్ నటిస్తున్నారు. ఇటీవల మీడియాలో నిర్వహించిన చిట్‌చాట్‌లో మిరాయ్ విశేషాలను ఆమె పంచుకున్నారు. ఇందులో తాను విభ అనే పవర్‌ఫుల్ రోల్‌ పోషిస్తున్నానని.. అది హిమాలయాల్లో ఉండే ఒక సన్యాసిని పాత్ర అని తెలిపారు. ఫాంటసీ, లవ్, యాక్షన్ అంశాలు తనకు బాగా నచ్చాయని అందుకే వెంటనే మిరాయ్‌కి ఓకే చెప్పినట్లు చెప్పింది.

అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రితికా నాయక్ తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తారు. తనకు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని ఆయనతో నటించాలని ఉందని రితికా నాయక్ తన మనసులోని మాటను బయటపెట్టారు. చిన్న పాత్రయినా చాలు, అల్లు అర్జున్‌ నటించిన సినిమాలో కనిపిస్తే చాలని రితిక తెలిపింది. మిరాయ్‌ రిజల్ట్‌తో తనకు అవకాశాలు క్యూకడతాయని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది.

More from Filmibeat

Read more about: ritika nayak teja sajja mirai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X