For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ లెజెండ్ డైలాగ్ తో రచ్చ.. గేటు కూడా తకనివ్వామంటూ.. ఏపీలో హాట్ టాపిక్ గా రోజా కామెంట్స్!

  |

  ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే రోజా ఒక పక్క టీవీ షోలు మరోపక్క రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఆమె లెజెండ్ సినిమాలో బాలకృష్ణ డైలాగులు వాడుతూ ఆమె తన రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకు పడడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఎన్నికల్లో

  ఎన్నికల్లో

  ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి అధికార వైసీపీ బీజేపీ పోటీ పడ్డాయి. అయితే అధికార పార్టీ నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య సుధ పోటీ చేయడంతో అక్కడి ప్రజలందరూ ఆమెకు పట్టం కట్టారు. దాదాపు 95 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గట్టిపోటీ ఇస్తామని భావించిన బిజెపి కేవలం 21 వేల ఓట్లకు పరిమితమైంది.

  అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము

  అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము

  ఇక ఈ ఎన్నికల గురించి మాట్లాడుతూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా సరే సింగిల్ హ్యాండ్ తో మట్టికరిపించగల సత్తా తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఉందని ఆమె చెప్పుకొచ్చారు.. అంతేకాక బద్వేల్ లో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ మూకుమ్మడిగా చేతులు కలిపి కుటిల ప్రయత్నాలు చేసినా తాము గెలిచామని ఆమె పేర్కొన్నారు. అయితే అక్కడి ప్రజలు చంద్రబాబుని చితకబాది తరిమి కొట్టారు అని పేర్కొన్న ఆమె బిజెపిని ఎమ్మెల్యే సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు.

  ఇప్పటికీ పాపులర్

  ఇప్పటికీ పాపులర్

  ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో లెజెండ్ సినిమాలో బాలకృష్ణ వాడిన ఈ డైలాగ్ ఇప్పటికీ పాపులర్.. కొద్ది రోజుల క్రితం రోజా జబర్దస్త్ సెట్ నుంచి నేరుగా బాలకృష్ణ కి ఫోన్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాలకృష్ణ రోజాతో ఫోన్‌లో మాట్లాడి సందడి చేశారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ.. రోజాని మా అందరి సమక్షంలో బాలకృష్ణకు ఫోన్ చేయాల్సిందిగా కోరింది.

  జబర్దస్త్ ఫోన్

  జబర్దస్త్ ఫోన్

  దీంతో రోజా.. ఆయన మంచి మూడ్‌లో ఉంటే ఓకే లేదంటే.. అని నవ్వుతూ బాలయ్యకి ఫోన్ కలిపింది. ఫోన్ లిఫ్ట్ చేసిన బాలకృష్ణ హా రోజా గారు నమస్కారం అంటూ తన సంస్కారాన్ని చూపించారు. 'బాగున్నారా?'.. అని రోజా అడగ్గా.. బాగున్నానమ్మ.. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను.. నేను జబర్దస్త్ లో ఉన్నానని రోజా చెప్పడంతో పాటు మీరేం చేస్తున్నారని బాలయ్యను అడగగా అఖండ షూటింగ్ జరుగుతుంది అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దామని రోజా అడిగింది.

  Recommended Video

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  కుడి భుజానికి సర్జరీ

  కుడి భుజానికి సర్జరీ

  ఇక తాజాగా బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ జరిగింది. హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం నందమూరి బాలకృష్ణ కుడి భుజం నొప్పిగా ఉందని కేర్ హాస్పిటల్ సంప్రదించగా కేర్ హాస్పిటల్ బృందం ఆయనకు ఎమ్మారై స్కానింగ్ చేసి సర్జరీ అవసరం అనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్ళింది. ఈ క్రమంలో కేర్ హాస్పిటల్ షోల్డర్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బి ఎం ప్రసాద్ నేతృత్వంలో నాలుగు గంటల పాటు మిగతా ఆర్థోపెడిక్ సర్జన్స్ టీమ్ తో కలిసి బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి బాలకృష్ణకి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చాలా బాగున్నారని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు

  English summary
  Roja uses balakrishna's legend dialogue to counter her political opponents.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X