For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హైదరాబాద్ లో చక్కర్లు కొడుతున్న RRR బ్రిటిష్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్

  |

  రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ కోసం వరల్డ్ వైడ్ గా ఎంతోమంది ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 1000 రోజులకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో తొలిసారిగా టాలీవుడ్ స్టార్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ మొత్తం కూడా దాదాపు ఫినిష్ అయ్యింది. ఇక సినిమాలో నటిస్తున్న బ్రిటీష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ చాలా రోజుల అనంతరం హైదరాబాద్ లో కనిపించడం విశేషం.

  హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

  RRR రిలీజ్ ఎప్పుడంటే?

  RRR రిలీజ్ ఎప్పుడంటే?

  RRR సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తుండగా ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇతర రోల్స్ లో అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు చెప్తున్నారు.

  భారీ యాక్షన్ మూవీగా

  భారీ యాక్షన్ మూవీగా

  ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్, అలానే చరణ్ కి జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని 1920కి పూర్వం జరిగిన స్వాతంత్రోద్యమ అంశాలతో పాటు అల్లూరి, భీమ్ల మధ్య సాగె స్నేహానుబంధంతో కూడిన కల్పిత కథను హైలెట్ చేయబోతున్నారు. RRR సినిమాను భారీ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

  నిజంగా అదృష్టం అంటూ

  నిజంగా అదృష్టం అంటూ

  ఇక ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఒలీవియా మోరిస్, ఫస్ట్ టైం ఒక భారతీయ సినిమా చేస్తోంది. ఇటువంటి సినిమా తనకు దొరకడం నిజంగా అదృష్టం అని, ఒక సాధారణ ఆడియన్ లా తాను కూడా మూవీ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నట్లుగా ఓవియా ఇటీవల మీడియా తో మాట్లాడుతూ చెప్పారు.

  హైదరాబాద్ లో ఒలివియా

  హైదరాబాద్ లో ఒలివియా

  అసలు మ్యాటర్ లోకి వెళితే ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఈ బ్యూటీ కొన్ని రోజులు సరదాగా గడపాలని అనుకుంటోంది. ఒలీవియా రెండు రోజులుగా హైదరాబాద్ లోని ప్రముఖ ప్రదేశాలు చుట్టేస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తోంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ ఆమెకు హైదరాబాదీ బిర్యానీ సహా అక్కడి ప్రసిద్ధి వంటలను రుచి చూపించారని సమాచారం.

  ఒలివియా ఫొటోలు వైరల్

  ఇక రెండు రోజుల నుండి అక్కడి ముఖ్య ప్రదేశాలు చుడుతున్న ఒలీవియా నేడు శిల్పారామంలో సందడి చేసారు. ప్రముఖ స్టైలిస్ట్ అను రెడ్డి తో కలిసి సందడిగా ఎంజాయ్ చేస్తున్న ఒలీవియా అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. సుందరమైన హైదరాబాద్ నగరం, ఈ వర్షంలో మరింత అద్భుతంగా ఉందని, టైం ఎంతో సరదాగా గడిచిపోతోంది అంటూ ఒలీవియా వివరణ ఇచ్చింది.

  ఆమె పెట్టిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ఒలీవియా ఆర్ఆర్ఆర్ లో జెన్నిఫర్ అనే బ్రిటిష్ యువతీ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి మంచి స్పందన లభించింది.

  English summary
  RRR actress Olivia Morris hyderabad photos viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X