Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోకు లిప్ లాక్ ఇవ్వాలని డైరెక్టర్ ఒత్తిడి.. చాలా కాలం తరువాత గుట్టును బయటపెట్టిన సాయి పల్లవి
సినిమా ఇండస్ట్రీలో మీటూకు సంబంధించిన విషయాలు కొన్నిసార్లు తగ్గుముఖం పడుతున్నట్లు అనిపించే లోపే మరోసారి ఊహించని విధంగా కొందరు స్టార్స్ సీక్రెట్స్ ను బయటపెడుతున్నారు. నచ్చకపోయినా కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్న కారణంగా రొమాంటిక్ సీన్స్ కోసం కొన్నిసార్లు లొంగిపోవాల్సి వస్తోందని చాలా మంది హీరోయిన్స్ డైరెక్ట్ గా ఇంటర్వ్యూలనే చెప్పారు. ఇక తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కూడా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

దర్శకుడి వలన చేదు అనుభవం
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ సాయి పల్లవి. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తప్పకుండా మ్యాటర్ ఉంటుందని అనేలా తన క్రేజ్ ను పెంచుకున్న సాయి రొమాన్స్ సీన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు చేయనని ముందే చెప్పేసింది. ఒకనొక సమయంలో దర్శకుడి వలన ఇబ్బంది పడాల్సి వచ్చినట్లు కూడా చెప్పింది.

ఆ హీరోతో లిప్ లాక్ చేయమని ఒత్తిడి
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన కెరీర్ గురించి అలాగే పర్సనల్ విషయాల గురించి కూడా వివరణ ఇచ్చింది. ఇక మీటూ ఆరోపణలపై స్పందిస్తూ.. చాలా రోజుల క్రితం ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు దర్శకుడు ముందుగా రొమాంటిక్ సీన్స్ గురించి చెప్పలేదు. కానీ సడన్ గా ఒకరోజు లిప్ లాక్ సీన్ లో హీరోతో నటించాలని చెప్పడంతో షాక్ అయ్యాను.

ఆ హీరో కలుగజేసుకొని..
అయితే అలాంటి సీన్స్ చేయనని ముందే చెప్పాను కదా అని సమాధానం ఇచ్చినప్పటికీ మళ్ళీ మళ్ళీ లిప్ లాక్ సీన్ లో నటించాలని ఒత్తిడి తెచ్చేవారు. వెంటనే ఆ సినిమా హీరో వచ్చి ఉహీంచని విధంగా స్పందించాడు. ఎందుకు ఆమెను ఇష్టం లేకపోయినా బలవంత పెడతారు. ఇష్టం లేకుంటే వదిలేయండి. మళ్ళీ ఆమె బయటకు వెళ్ళినప్పుడు మీటూ అంటే మనం ఇబ్బందుల్లో ఇరుక్కుంటాం అంటూ సదరు హీరో దర్శకుడికి చెప్పి మ్యాటర్ ను క్లోజ్ చేసినట్లు సాయి పల్లవి తెలిపింది.

గ్లామర్ పాత్రలకు దురమే ఎందుకంటే..
కేవలం ఒక్క రొమాంటిక్ సీన్స్ లోనే కాదు సాయి పల్లవి ప్రతి విషయంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. గ్లామరస్ డ్రెస్సులు కూడా వేసుకొనని ముందే చెబుతుంది. నా కుటుంబ సభ్యులు నా సినిమా చూసినప్పుడు తల దీంచుకోవద్దు వారి గౌరవానికి తగ్గట్లుగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతానని కూడా సాయి పల్లవి వివరణ ఇచ్చింది.

2కోట్ల యాడ్.. చేయకపోవడానికి కారణం
ఇమా యాడ్స్ రిజెక్ట్ చేసే విషయంపై కూడా మరోసారి చాలా క్లారిటీగా వివరణ ఇచ్చింది. ఒక్క నిమిషం యాడ్ లో నటిస్తే రెండు కోట్లు వస్తాయి కదా ఎందుకు చేయడం లేదనే ప్రశ్న పై అమ్మడు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. నాపై నమ్మకం పెట్టుకొని ఎవరైనా మోసపోతే నాకు నచ్చదు. అందానికి సంబంధించిన ప్రాడక్ట్స్ వల్ల అందం విలువ పేరుగుతుందని నేను అనుకోను నా చెల్లిని నేను మోసం చేయలేను అలాగే నన్ను అభిమానించే వారిని కూడా మోసం చేయడం ఇష్టం ఉండదని గొప్పగా వివరణ ఇచ్చింది ఈ ఫిదా బ్యూటీ.