ఆ కారణంగానే రూ. 2 కోట్ల ఆఫర్ వదులుకున్నాను: సాయి పల్లవి

మలయాళంలో 'ప్రేమమ్', తెలుగులో 'ఫిదా' చిత్రం భారీ విజయం సాధించడంతో సాయి పల్లవి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన NGK మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సూర్య హీరోగా రూపొందిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ మరో హీరోయిన్‌గా నటించింది.

కొన్ని రోజుల క్రితం సాయి పల్లవి గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఓ ఫెయిర్‌నెస్ క్రీం సంస్థ తమ యాడ్ ఫిల్మ్‌లో నటించాలని ఆమెకు రూ. 2 కోట్లు ఆఫర్ చేసింది. దాన్ని నిర్మొహమాటంగా రిజక్ట్ చేసింది ఈ తమిళ బ్యూటీ. తాజాగా NGK ప్రమోషన్లో పాల్గొన్న ఆమె ఈ అంశంపై స్పందించారు.

Sai Pallavi confirmed that she had to reject the Fairness cream commercial

ఫెయిర్‌నెస్ క్రీం యాడ్స్ చేయడం వల్ల సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశ్యంతోనే తాను రిజక్ట్ చేసినట్లు సాయి పల్లవి తెలిపారు. తన సోదరి పూజా నా కంటే రంగు తక్కువగా ఉంది అని బాధ పడుతూ ఉండేది. తనకు ప్రూట్స్, వెజిటబుల్స్ తినడం ఇష్టం లేకున్నా.... అవి తింటే ఫెయిర్‌గా మారుతావని నేను చెప్పినందుకు ఇప్పటికీ తింటూనే ఉంది. తన చర్మ రంగు గురించి ఆమె ఎంతగా ఫీలవుతుందో నాకు అర్థమైంది.

నేను డబ్బు కోసం అలాంటి ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్ చేయడం మొదలు పెడితే సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపినట్లే అవుతుంది. చర్మ రంగును చూసి వ్యక్తి అందాన్ని లెక్కించడం సరైంది కాదు అనేది నా భావన. ఎవరూ ఏ రంగులో ఉన్నా ఎలాంటి ఆత్మన్యూన్యతా భావానికి లోనుకాకుండా సంతోషంగా ఉండాలనేది నా కాన్సెప్ట్.

ఫారినర్స్ ఎవరినీ కూడా మనం ఎందుకు తెల్లగా ఉన్నావని అడగం... ఎందుకంటే అది వారి కలర్. వారు తెల్లగా ఉండటం వల్ల క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నలుపు అనేది మన ఇండియన్ కలర్. ఇక్కడి వాతావరణానికి తగిన విధంగా ఇది ఉంటుంది' అని సాయి పల్లవి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X