»   » మరణం అంచుల్లోకి వెళ్లిన హీరోయిన్: ఆ హీరో సహాయం వల్లే...బ్రతికింది!

మరణం అంచుల్లోకి వెళ్లిన హీరోయిన్: ఆ హీరో సహాయం వల్లే...బ్రతికింది!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'వీర్‌గాటి' సినిమాలో నటించిన హీరోయిన్ పూజా దద్వాల్ గురించి ఆ మధ్య మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తీవ్రమైన టీబీ వ్యాధి సోకి వైద్యానికి కూడా డబ్బులేని దీనమైన స్థితిలో ఆమె ఉండటం అందరినీ కలిచి వేసింది. మీడియా ద్వారా పూజా విషయం ఆలస్యంగా తెలుసుకున్న సల్మాన్ ఖాన్... ఆమెకు సహాయం అందించారు. తను నిర్వహిస్తున్న 'బీయింగ్ హ్యూమన్' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయం అందించారు. పూజా ఇపుడు పూర్తిగా కోలుకుంది. త్వరలోనే ఆమెను డిచ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

  ఆయన వల్లే బ్రతికాను: పూజ

  ఆయన వల్లే బ్రతికాను: పూజ

  ఓ ఆంగ్లపత్రికతో పూజా మాట్లాడుతూ... ‘మార్చి 2న నేను తీవ్రమైన టిబీతో ఆసుపత్రిలో చేరినపుడు చనిపోతాను అనుకున్నాను. నా వద్ద అపుడు టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను వదిలేశారు. అలాంటి సమయంలో నాకు సల్మాన్ ఖాన్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. బట్టలు, సబ్బులు, డైపర్స్, ఫుడ్, మెడిసిన్... ఆయన ఫౌండేషన్ నా విషయంలో చాలా కేర్ తీసుకుంది. నేను ఈ రోజు కోలుకోవడానికి ఆయనే కారణం' అని తెలిపారు.

  అంతకు ముందు సల్మాన్ మీద విమర్శలు

  అంతకు ముందు సల్మాన్ మీద విమర్శలు

  అప్పట్లో.... మీడియా ద్వారా పూజా తనకు సల్మాన్ ఖాన్ సహాయం చేయాలని వేడుకోవడంతో ఈ అంశం మరింత హైలెట్ అయింది. అయితే సల్మాన్ నుండి మొదట ఎలాంటి స్పందన లేక పోవడం, రవి కిషన్ లాంటి భోజ్‌పురి యాక్టర్ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రావడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

  తర్వాత స్పందించిన సల్మాన్

  తర్వాత స్పందించిన సల్మాన్

  గతంలో సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్' టూర్ పేరుతో పూణెలో పర్యటించిన సందర్భంగా ఆయనకు పూజా దద్వాల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ స్పందిస్తూ తనకు ఇప్పుడే ఈ విషయం తెలిసిందని, తప్పకుండా ఆమెకు సహాయం చేస్తానని తెలిపారు.

  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సల్మాన్

  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సల్మాన్

  ‘వీర్‌గాటి' చిత్రంలో పూజా నాకు జతగా నటించలేదు. ఇందులో ఆమె అతుల్ అగ్నిహోత్రికి జోడీగా నటించారు. పూజా గురించి తెలిసి చాలా బాధ పడ్డాను. ఆమెకు సహాయం చేయడానికి మా టీం రంగంలోకి దిగింది. నాకు సాధ్యమైనంత సహాయం చేస్తాను. ఆమె త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను... అని అప్పట్లో సల్మాన్ ఖాన్ మీడియా ముఖంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  English summary
  Salman Khan's co-star in Veergati, Pooja Dadwal was admitted in March 2018 due to tuberculosis and had no money to clear the hospital bills and was abandoned by her family and friends. She made a plea to Salman Khan, asking him to help her out in these tough times, and the actor swung into action through his NGO 'Being Human' and now Pooja Dadwal has partially recovered from TB and will soon be discharged.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more