Top Heroines: మోస్ట్ పాపులర్ హీరో‌యిన్‌గా సమంత.. ఆలియా, దీపిక, రష్మిక కు ఎన్నో ప్లేస్ అంటే?

సహజంగానే ఇండియాలో టాప్ హీరోయిన్ ఎవరంటే? ఏ ఐశ్వర్య రాయో, అలియా భట్టో, దీపికా పదుకొనెనో, కియారా అద్వానీనో అనుకుంటాం. దేశంలో బాలీవుడ్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా అందరి భావన ఇదే. ఆర్మాక్స్ మీడియా సంస్థ దేశంలో టాప్ హీరోలు, హీరోయిన్లు, సినిమాలు ఎవరన్న దానిపై గత కొంతకాలంగా సర్వేలు చేస్తూ ఫలితాలను ప్రకటిస్తోంది. ఏ నెలకు ఆ నెలలో అగ్రస్థానంలో ఉన్న స్టార్స్ వివరాలను వెల్లడిస్తోంది. తాజాగా జూలై 2025కు సంబంధించి ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరన్న దానిపై ప్రకటన చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

చెక్కుచెదరని సమంత క్రేజ్
జూలై నెలకు గాను ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా నిలిచారు సమంత రూత్ ప్రభు. బాలీవుడ్ భామలను, లేడీ సూపర్‌స్టార్లను, నేషనల్ క్రష్‌లను వెనక్కినెట్టి సమంత ఈ ప్లేస్ దక్కించుకున్నారు. అయితే ఇది ఒక్కసారి కాదు.. గడిచిన కొంతకాలంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ఇండియాలోని మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్ట్‌లో సమంత అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, మరికొన్ని కారణాలతో సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఏకంగా జాతీయ స్థాయిలోనూ ఆమె ఛరిష్మా తారాస్థాయికి చేరుకుంది.

Samantha beats Alia Rashmika Deepika among Ormax Media most popular female stars in india list

వార్తల్లో సమంత
దక్షిణాది నుంచి వచ్చి ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా నిలవడం సాదాసీదా విషయం కాదు. ది ఫ్యామిలీ‌మెన్, సిటాడెల్ వంటి వెబ్‌సిరీస్‌లతో సమంతకు జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కింది. అయితే నాగచైతన్యతో విడాకులు, నాగచైతన్య శోభితల పెళ్లి, రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారన్న పుకార్ల నేపథ్యంలో సమంత నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్‌లలో సామ్ పేరు మార్మోగుతోంది. అందుకే ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా సమంత వరుసగా నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్‌సిరీస్‌లో సమంత నటిస్తున్నారు.

టాప్ 10 భామలు వీరే
ఇక ఈ లిస్ట్‌లో అలియా భట్ 2వ స్థానంలో, దీపికా పదుకొణె 3వ స్థానంలో, కాజల్ అగర్వాల్ 4వ స్థానంలో, త్రిష కృష్ణన్ 5వ స్థానంలో నిలిచారు. మొత్తంగా టాప్ 5లో ముగ్గురు దక్షిణాది తారలే ఉండటం గమనార్హం. తర్వాత ఆరో స్థానంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, 7వ స్థానంలో లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి, 8వ స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, 9వ స్థానంలో శ్రీలీల, 10వ స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాలు నిలిచారు.

అడ్రస్ లేని బాలీవుడ్ భామలు
పుష్ప , యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి వరుస బ్లాక్‌బస్టర్స్ చేసినప్పటికీ రష్మిక మందన్న పెద్దగా తన ర్యాంకింగ్‌ను మెరుగు పరచుకోలేకపోయారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు కియారా అద్వానీ, జాన్వీ కపూర్, అనన్య పాండేలు వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ టాప్ 10లో స్థానం సంపాదించుకోలేకపోయారు. మొత్తంగా ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఆరుగురు దక్షిణాది హీరోయిన్లే కావడం గమనార్హం. కాజల్, తమన్నాలు కూడా సౌత్ సినిమాలతోనే పాపులర్ అయినప్పటికీ ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు. కాగా.. ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: ormax media prabhas samantha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X