2 ఏళ్లుగా సినిమాలు లేవు.. నా పరిస్థితి ఇలా ఉంది.. సమంత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయం, టాలెంట్ తో చిత్ర పరిశ్రమలో సమంత రూత్ ప్రభు అంచెలంచెలుగా ఎదిగింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇక సమంత తన మొదటి చిత్రం అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. 2010లో ఏమాయ చేసావే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక సమంత రూత్ ప్రభు తెలుగు చిత్ర పరిశ్రమలో 15 ఏళ్లకు పైగా యాక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది. చివరిగా అక్కడ సిటాడెల్ : హానీ బన్నీ అనే యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ తర్వాత సమంత మయోసైటిస్ భారిన పడి అవస్థ పడింది. రీసెంట్ గానే మళ్లీ యాక్టివ్ అయ్యింది.

తన ఆరోగ్య సమస్యల కారణంగా సమంత రూత్ ప్రభు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక తెలుగులో చివరిగా ఖుషి అనే చిత్రంతో అలరించింది. ఆ తర్వాత వెండితెరపై మెరిసిందే లేదు. అయితే తాజాగా సమంత రూత్ ప్రభు తన సినిమాలు, కెరీర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఢిల్లీలో నిర్వహించిన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 52వ జాతీయ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్‌లో ఆమె మయోసైటిస్ వ్యాధితో తన జీవితం ఎలా మారిపోయిందో తెలియజేసింది.
నటీనటుల నుంచి గతంలో ఒక ఏడాదికి 5 సినిమాలు విడుదలయ్యాయి. అలా విడుదలైతే సక్సెస్ కు చిరునామ. ఆ ఐదు సినిమాలు పెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిస్తే ఇక వారు టాప్ 10 నటుల జాబితాలో చేరిపోతారు. దాంతో మల్టీనేషనల్ బ్రాండ్‌లను ప్రమోట్ చేసే స్థాయి వారికి వస్తుంది. కానీ ప్రస్తుతం నా నుంచి రెండేళ్లుగా ఒక్క సినిమా విడుదల కాలేదు. నేను టాప్ స్టార్ జాబితాలోనూ లేను. నా దగ్గర 1000 కోట్ల సినిమా లేదు, కానీ నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా మాత్రం ఉన్నాను. గతంలో చాలా సున్నితంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఎలా బాధ లేదు.
ఇప్పుడు నాకు 38 ఏళ్లు. ఎల్లప్పుడూ జీవితంలో ఏం జరుగుతుందో అనే భయాలను ఒకే ఏడాదిలో విడిపోయినట్టు తెలిపింది. ఇక నా అభిమానులు, ఫాలోవర్స్ ఎప్పుడూ తన గ్లామరస్ లైఫ్, సినిమాల గురించి ఆసక్తిగా ఉంటారనేది తెలిసిందే. అదే సమయంలో నా పాడ్ కాస్ట్ వల్ల వారికి హెల్త్ కు సంబంధించిన విషయాలను కూడా ఒంటపట్టించుకుంటారని చెప్పుకొచ్చింది. ఇక సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం, రక్త్ భ్రమండ్ : బ్లడీ కింగ్డమ్ అనే చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











