అందుకే సినిమాలకు దూరం.. తన ప్రాబ్లెంను బయట పెట్టిన సమంత!

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు టాలీవుడ్ లో కొంత కాలం ఊపూపిన సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. తన టాలెంట్ తో భారీ ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంది. అగ్ర హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. 15 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా సినిమాలు చేసింది. కానీ రెండేళ్ల నుంచి సమంత కాస్తా సినిమాల జోరును తగ్గించింది. అందుకు కారణం ఏంటనేది తాజాగా వెల్లడించింది సమంత. ఆ వివరాల్లోకి వెళితే..

2 ఏళ్లు సినిమాలకు దూరం..
సమంత రూత్ ప్రభు ప్రస్తుతం జోరుగా నిసిమాలు చేయడం లేదు. గతంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ అలరించింది. కానీ తన డివోర్స్ తర్వాత సమంత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. డివోర్స్, తన హెల్త్ ప్రాబ్లం కారణంగా సినిమాలకు సైన్ చేయడం మానేసింది. ఏడాది పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. దాంతో ప్రేక్షకులకు 2 ఏళ్లుగా వెండితెరపై మాత్రం కనిపించ లేదు. ప్రస్తుతం పలు సినిమాల్లో చేసేందుకు రెడీ అయ్యింది.

Samantha Ruth Prabhu Gave Clarity why not doing Multiple Movies Now

సమంత క్లారిటీ..
కొద్ది కాలంగా సమంత ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో ఎలాంటి సినిమాలకు సైన్ చేయడం లేదు. కొత్త సినిమాల ఊసే కనిపించడం లేదు. దీంతో సమంత ఎందుకు సినిమాలను ఎక్కువ శాతం చేయట్లేదని అభిమానులు సందేహిస్తున్నారు. దీనిపై తాజాగా సమంత రూత్ ప్రభు స్పందించింది. తన సెకండ్ ఫేస్ ఆఫ్ కెరీర్ గురించి తాజాగా చెప్పుకొచ్చింది. ఎందుకు సినిమాలు ఎక్కువగా చేయడం లేదో వివరించే ప్రయత్నం చేసింది.

సమంత కొద్దినెలలుగా హెల్త్ కేర్ పై అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన ఫిల్మ్స్, కెరీర్ గురించి కూడా మాట్లాడింది. 'గతంలో ఏడాది 5 చిత్రాల వరకు చేసేదాన్ని. అప్పుడు హెల్త్ పై తక్కువ శ్రద్ధ వహించే వాళ్లం కూడానూ. కానీ ప్రస్తుతం నా కెరీర్ లో సెకండ్ ఫేజ్ ప్రారంభం అయ్యింది. ఇప్పుడు ఫిట్ నెస్ తో పాటు ఫిల్మ్స్ పైనా కూడా ఫోకస్ పెట్టాను. గతంలో లాగా వర్క్ లోడ్ లేకుండా చూసుకుంటున్నారు. ఏడాదికి ఐదేసి సినిమాలు కాకుండా నచ్చిన పాత్రల్లోనే నటిస్తూ ఫిట్ నెస్, హెల్త్ పైన శ్రద్ధ వహిస్తున్నాని' చెప్పింది.

అలాగే తన చేయబోయే సినిమాలు, నిర్మించోయే సినిమాలు, నటించబోయే పాత్రల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. ఇక సమంత
గతేడాదంతా సమంత మయోసైటిస్ తో బాధపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సమంత రూత్ ప్రభు ఆరోగ్యంగా మారింది. చివరిగా 'శుభం' అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. తన నుంచి నటిగా మా ఇంటి బంగారం, హిందీ రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X