For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆ డైరెక్టర్ లైంగికంగా వేధించాడు.. బెదిరించి అలా చేయించాడు.. సంజన ఫైర్

  |

  దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఊపందుకొంటున్నది. తమకు జరిగిన అన్యాయాలపై పలువురు సినీ తారలు గళం విప్పుతున్నారు. చిన్మయి, తమిళ యాంకర్ హేమా మాలినికి అందాల తార సంజన తోడైంది. 12 ఏళ్ల క్రితం దర్శకుడితో తనకు జరిగిన చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. తన మొదటి సినిమా సందర్భంగా దర్శకుడు వేధించిన తీరును మీడియాకు వివరించింది. మీ టూ ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో సామాజిక కార్యకర్తగా నా బాధ్యతను నెరవేర్చాలని అనుకొంటున్నాను. ఆమె ఏమన్నారంటే..

  నా తొలి సినిమా

  నా తొలి సినిమా

  12 ఏళ్ల క్రితం గండ హెండతి అనే కన్నడ సినిమాతో నా కెరీర్ ప్రారంభమైంది. హిందీలో ఘన విజయం సాధించిన మర్డర్ చిత్రానికి అది రీమేక్. ముద్దు సీన్ల చిత్రీకరణ సందర్భంగా నన్ను వేధించాడు. అవసరం లేకున్నా నాతో కొన్ని సీన్లు చిత్రీకరించాడు. పైగా నాపై నోరు కూడా పాడేసుకొన్నారని ఆ చేదు ఘటనను నటి సంజన గుర్తు చేసుకొన్నది.

  #మీటూ: ఇలాంటి జీవితం నాకొద్దంటూ ఆత్మహత్యాయత్నం!

  ముద్దు సీన్ల చిత్రీకరణ

  ముద్దు సీన్ల చిత్రీకరణ

  సినిమా షూటింగ్‌కు ముందు సినిమాలో ఒకటే ముద్దు సీన్ ఉంటుందని చెప్పాడు. మూడు రోజుల తర్వాత కూడా అదే ముద్దు సీన్లను చిత్రీకరిస్తున్నారు. దాంతో ముద్దు సీన్ అయిపోయిందనే విషయాన్ని నేను వారి దృష్టికి తెచ్చాను. అప్పుడు నాపై దారుణంగా అరిచాడు. నానా మాటలు అన్నారని సంజన ఆవేదన వ్యక్తం చేసింది.

  నీ సంగతి చూస్తానని

  నీ సంగతి చూస్తానని

  నీవు కొత్త యాక్టర్‌వి. నీకు ఏమి తెలుసు. నీవు చెప్పినట్టు చేయకపోతే నీ సంగతి చూస్తానని డైరెక్టర్ బెదిరించాడు. అంతేకాకుండా నాతో బలవంతంగా ముందుగా చెప్పని కొన్ని సీన్లు చేయించారు. నేను కావాలనే అలాంటి సీన్లలో నటించానని అందరూ అనుకొన్నారు. ఆ సీన్ల వెనుక ఉన్న వాస్తవం బయటి ప్రపంచానికి తెలియదు అని సంజన వెల్లడించింది.

  సినీ పరిశ్రమ ఎంతో ఇచ్చిందని

  సినీ పరిశ్రమ ఎంతో ఇచ్చిందని

  నేను ఇప్పటి వరకు సుమారు 50కిపైగా దక్షిణాది సినిమాల్లో నటించాను. మహిళలకు సినీ పరిశ్రమ ఎంతో ఇచ్చింది. సినీ పరిశ్రమపై ఎవరైనా విమర్శలు చేస్తే నాకు కోపం వస్తుంది. ఓ మహిళ స్వతంత్రంగా ఎదుగడానికి, ప్రజాదరణ పొందడానికి ఇండస్ట్రీ తోడ్పడుతుంది. అలాంటి సినీ పరిశ్రమను విమర్శించవద్దు అని సంజన తెలిపింది.

   కొందరు చెడ్డవాళ్లు లేకపోలేదు.

  కొందరు చెడ్డవాళ్లు లేకపోలేదు.

  సినీ పరిశ్రమలో అంతా చెడు ఉందని చెప్పడం సబబు కాదు. అందరూ మంచి వాళ్లే అని చెప్పడం సరికాదు. కొందరు చెడ్డవాళ్లు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులు అన్ని పరిశ్రమల్లోనూ ఉంటాయి. కొందరు చెడు తీరు వల్ల సినీ పరిశ్రమను అవమానించడం తగదు అని సంజన పేర్కొన్నారు.

  ఆఫర్లు రావనే కారణంతోనే

  ఆఫర్లు రావనే కారణంతోనే

  నా కెరీర్ ఆరంభంలో ఇలాంటి విషయాలు చెప్పడానికి భయపడ్డాను. ఆఫర్లు రావనే కారణంతో నేను మాట్లాడలేదు. కానీ నేను ప్రస్తుతం ఆర్థికంగా బాగున్నాను. ఒకరు నాకు ఆఫర్లు తిరస్కరిస్తే, మరొకరు నన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ప్రతిభ కారణంగానే అవకాశాలు తెచ్చుకొంటున్నారు. చాలా మంది దర్శకులు, నిర్మాతలు టాలెంట్ ప్రకారమే అవకాశాలు ఇస్తున్నారు అని సంజన తెలిపింది.

  English summary
  The Me Too campaign has seen numerous actresses coming out and sharing their sordid experiences of sexual misconduct in the industry. Now actress Sanjjanaa reveals how she was harassed during her debut film. The actress was launched 12 years ago in the Kannada film Ganda Hendathi, a remake of the Hindi film Murder. Sanjjanaa recalls how she was forced by the director to do certain scenes in the film despite not wanting to.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more