Just In
Don't Miss!
- News
జగన్ రెడ్డి క్రూరత్వం.. దేవినేని ఉమా అరెస్ట్ అక్రమం ; కొడాలి నానిపై కేసు పెట్టాలని చంద్రబాబు ఆక్రోశం
- Sports
గెలిచిన ఆనందంలో రోహిత్ శర్మ నోట బూతులు.. వీడియో వైరల్!
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Automobiles
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డేంజర్ జోన్.. వాళ్ళు గేట్లు ఎత్తేశారు.. ప్రాణభయంతో సీనియర్ హీరోయిన్ మీనా షాకింగ్ పోస్ట్
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ టాప్ లిస్ట్ తీస్తే అందులో మీనా తప్పకుండా ఉంటుంది. తమిళ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 20 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా ఉంటున్న మీనా ప్రస్తుతం తమిళనాడులోనే ఉంటోంది. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె ఒక్కసారిగా ప్రాణభయంతో ఉన్నట్లు చెప్పడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు.

అప్పట్లో బిజీ హీరోయిన్ గా మీనా
మీనా ఆరేళ్ళ వయసులోనే వెండితెరపై బాల నటిగా మెరిసింది. ఆమె తమిళ్ లోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ అందుకుంది. 1990 నుంచి 2003 వరకు కూడా మీన కెరీర్ కు అస్సలు బ్రేక్ పడలేదు. హీరోయిన్ గా ఆమె ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసుకుంటూ వెళ్ళేది.

ఇప్పుడు కూడా అదే హవా
సౌత్ ఇండియన్ లో అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగల మీనా హిందీలో కూడా పర్ఫెక్ట్. మీనా చాలా వరకు ఇండస్ట్రీలో ఏనాడు పెద్దగా కాంట్రవర్సీలకు వెళ్లలేదు. ఆమె దాదాపు అగ్ర హీరోలందరితోను యాక్ట్ చేసింది. ఇప్పుడు కూడా దృశ్యం వంటి సినిమాల ద్వారా ఫీమేల్ లీడ్ పాత్రల్లో నటిస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్పుడప్పుడు ఆడియెన్స్ కి టచ్ లో ఉంటోంది.

సోషక్ మీడియాలో భారీ క్రేజ్
కేవలం సినిమా సీరియల్స్ లలో నటిగానే కాకుండా మీనా టెలివిజన్ రియాలిటీ షోలతో హాస్ట్ గా కూడా దర్శనమిస్తోంది. ఆ మధ్య జబర్దస్త్ షోలో కూడా ఆమె స్పెషల్ జడ్జ్ గా రోజా పక్కన దర్శనమిచ్చింది. ఏదేమైనా మీనాకు అప్పుడున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అర్ధమవుతోంది. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా నిమిషాల్లో వైరల్ అవుతోంది.
డేంజర్ జోన్ లో మీనా
ఇక చాలా రోజుల తరువాత మీనా బయపడుతున్నట్లు ఒక షాకింగ్ పోస్ట్ చేసింది. తమిళనాడులో మరోసారి జలప్రళయం నివర్ తుఫాను జనాలను భయానికి గురి చేస్తోంది. వర్షం ఏ మాత్రమే ఏక్కువైనా కూడా కొన్ని ప్రాంతాలు డేంజర్ జోన్ లోకి వెళతాయి. ఇక మీనా కూడా దాదాపు డేంజర్ జోన్ కి దగ్గరగానే ఉన్నట్లు ఆమె పోస్ట్ ద్వారా అర్ధమవుతోంది.

అలా జరక్కపోతే చాలు
వర్షాలు పడుతుంటే మొదటిసారి ఎంతగానో భయం వస్తోంది. చెన్నైలోని చెంబరంబాక్కం డ్యామ్ గేట్లు ఎత్తేసినట్లు చెబుతూ.. తన ఇంటి ముందు వర్షం పడుతున్న వీడియోను షేర్ చేశారు మీనా. అలాగే 2015నాటి జలప్రళయ పరిస్థితి పునరావృతం కాకుండా ఉంటే చాలని కూడా వివరణ ఇవ్వడంతో నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. అయితే అక్కడ మాత్రం రోజురోజుకు వర్షపాతం పెరుగుతుండడం వలన పలువురు సెలబ్రెటీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.