సైరా అలీ ఖాన్ యాక్టింగ్ భేష్.. షర్మిల టాగోర్ ప్రశంస
పటౌడీ, టాగోర్ కుటుంబంలో నుంచి మూడో తరం వెండితెరపైకి వచ్చింది. నవాబ్ అలీ పటౌడీ, షర్మీల టాగోర్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఇప్పుడు సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ కూడా కేదార్‌నాథ్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 7న రిలీజ్ అయింది. ఈ సినిమాను తన నానమ్మ షర్మిల టాగోర్ చూసి ప్రశంసలతో ముంచెత్తారు.
కేదార్‌నాథ్ సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించడం నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. తెరమీద ఆమె చూపించిన కాన్ఫిడెన్స్ చూసి ముచ్చట పడ్డాను. ఆ రకంగా నటించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను అని షర్మిల టాగోర్ పేర్కొన్నారు.

సారా అలీ ఖాన్ నటించిన కేదార్‌నాథ్ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రం తొలివారాంతంలోనే 30 కోట్ల రూపాయల కలెక్షన్లను సంపాదించింది.
కేదార్‌నాథ్ మూవీ తర్వాత తెలుగులో విజయం సాధించిన టెంపర్ రీమేక్‌లో సారా ఆలీఖాన్ నటించింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ సరసన నటిస్తున్నది. ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











