twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేపిస్టులను కఠినంగా శిక్షించాలి.. హత్రాస్‌ ఘటనపై షెర్లీన్ చోప్రా ఆవేదన

    |

    బాలీవుడ్‌లో శృంగార తార షెర్లీన్ చోప్రా ఇటీవల కాలంలో తన సోషల్ మీడియాలో పలు విషయలపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. క్రికెటర్ల భార్యలు డ్రగ్స్ తీసుకొనే విషయం కానా, దీపిక పదుకోన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో గానీ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అంతేకాకుండా పాయల్ ఘోష్ మీటూ ఉద్యమానికి ఆమె మద్దతుగా నిలిచారు. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై షెర్లీన్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు.

    ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన గ్యాంగ్ రేప్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆమె అత్యాచారం జరిపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా బాధితురాలి శవాన్ని పోలీసులు దహనం చేయడంపై తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపిస్టులకు కఠినశిక్షను అమలు చేయాలి. అమానీయ సంఘటనలను ఉపేక్షించవద్దు. అనాగరిక చర్యలను ఖండించాలి అని షెర్లీన్ చోప్రా అన్నారు.

    Sherlyn Chopra demands Justice for Hathras Victim family

    ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన షెర్లీన్ చోప్రా ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నారు. వెబ్ సిరీస్‌ నిర్మించడంతోపాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. త్వరలోనే తన ఫ్లాట్‌ఫామ్‌లో షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని కథలను కూడా సిద్దం చేస్తున్నారు. గతంలో మద్యం, ధూమపాన వ్యసనాలకు అలవాటు పడిన షెర్లీన్ చోప్రా ప్రస్తుతం వాటిని పూర్తిగా మానేశారు. లాక్‌డౌన్‌లో మద్యానికి దూరమైనట్టు వెల్లడించారు.

    English summary
    Bollywood actress Sherlyn Chopra has never backed up talking for the rights of the women the actress recently tweeted about the "Hathras Gang Rape" Alledgely the victim was rape by the 4 men and the police official cremented the body of the victim without family's permission. Sherlyn Chopra tweeted, "Let there be capital punishment for rapists. It’s high time India shows zero tolerance for inhumanity and barbarism!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X