Shibani Dandekar.. సీక్రెట్ ప్లేస్‌లో పచ్చబొట్టు.. ఇన్స్‌టాగ్రామ్‌లో అలా షేర్ చేసి
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మరోసారి ప్రేమలో పడ్డారు. శక్యా, అఖీరా అనే ఇద్దరు పిల్లల తర్వాత తన భార్య అధునా భబానీకి 2016లో విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శిభానీ దండేకర్ అనే హీరోయిన్‌తో గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఫర్హాన్, శిభానీ మధ్య అతి సన్నిహిత సంబంధాలను తెలియజేసే ఫోటోలు మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయ్యాయి. అయితే వారిద్దరి డేటింగ్ వ్యవహారం మూడేళ్లుగా నిలకడగా ముందుకు సాగుతున్నది. వారిద్దరు ఒకరంటే మరొకరిపై విడదీయలేని ప్రేమ వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఆగస్టు 27 జన్మదినం జరుపుకొన్న ఈ ముద్దుగుమ్మ ఫర్హాన్ అంటే ఎంత ఇష్టమో అనే విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఫర్షాన్ పేరును కనిపించి.. కనిపించకుండా వేసుకొన్న పచ్చబొట్టు గురించి మరింత వివరాల్లోకి వెళితే..

శిభానీ దండేకర్ ఇండో ఆస్ట్రేలియన్ సింగర్, యాక్టర్, యాంకర్, మోడల్. స్వతహాగా మరాఠీ అయినప్పటికీ.. ఆస్ట్రేలియాలో కుటుంబం స్థిరపడటంతో ఆమె జీవితం కొంత అక్కడే సాగింది. నటిగా, గాయనిగా రాణిస్తూనే 2019లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో హోస్ట్‌గా వ్యవహరించడంతో భారీగా పాపులారిటీని సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత పర్హాన్ అఖ్తర్‌తో డేటింగ్ చేయడంతో మరింత క్రేజ్‌ను దక్కించుకొన్నది. బాలీవుడ్‌లో టైంపాస్, సంఘర్ష్, రాయ్, షాందార్, సుల్తాన్, నామ్ షబానా, నూర్, భవేష్ జోషి చిత్రాల్లో గాయని, నటిగా వ్యవహరించింది. 2021లో ఫిర్కి చిత్రంతోపాటు క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మి, కన్నడ రీమేక్ జామ్ జామ్ చిత్రాల్లో నటించింది.
మోడల్‌గా నైక్, రోల్స్ రాయిస్, ప్యూమా, మెర్సిడెస్, టయోటా, హెచ్ఎస్‌బీసీ, ఎంటీవీ, నీవియా, సోనీ తదితర బ్రాండ్స్‌కు వ్యవహరించింది. షారుక్ ఖాన్‌తో కలిసి అట్లాంటిక్ సిటీ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరించింది. అలాగే ఝలక్ దిక్లా జా, బీబీసీలో ప్రసారమైన డ్యాన్సింగ్ విత్ ది స్టార్స్, కలర్స్ టీవీలో ప్రోగ్రామ్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది.
తాజాగా శిభానీ దండేకర్ తన 42వ పుట్టిన రోజున ఫర్హాన్ అఖ్తర్‌పై కుప్పలుతెప్పులుగా ప్రేమను కురిపించింది. ఇతరులకు కనిపించి కనిపించని ప్రదేశమైన మెడ భాగంలో ఫర్హాన్ అని పేరును పచ్చ బొట్టుగా వేసుకొన్నది. ఆ విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీగా వెల్లడించింది.
మెడ భాగంపై వేసుకొన్న Farhan అంటూ పచ్చబొట్టు వేసుకొన్న శిభానీ దండేకర్.. పర్‌ఫెక్టుగా నా మెడపై నా ప్రియుడి పేరును రాసుకొన్నాను అంటూ ముచ్చటపడిపోయింది. పచ్చ బొట్టు ఉన్న ప్రదేశాన్ని ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసి తన ప్రేమను మరింతగా వ్యక్తం చేశారు. ఆ పచ్చ బొట్టు మెడపై మరో ఆభరణంగా మారడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు విసిరారు.

అయితే అభిమానులకు మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చింది. తన చేతిపై మరో పచ్చ బొట్టును కూడా వేసుకొన్నాను అని చెప్పింది. కానీ అది ఏమిటి? ఏ ప్రదేశంలో వేసుకొన్నాననే విషయాన్ని వెల్లడించకపోవడంతో ఫ్యాన్స్, నెటిజన్స్‌లో మరింత ఆసక్తిని రేపింది.


Click it and Unblock the Notifications











