Don't Miss!
- News
Vastu tips: జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Shraddha Das: మల్లెపూవును తలపిస్తోన్న శ్రద్ధా దాస్.. నాభి అందాలతో సోకుల విందు
అందం, అభినయంతోపాటు గ్లామర్ తో ఆకట్టుకునే హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీలో కొదవ లేదు. అలాంటి వారిలో మోస్ట్ గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఒకరు. తన అందం, చందంతో యువత మనసులను కొల్లగొట్టింది ఈ భామ. కానీ, శ్రద్ధా దాస్ కు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఒకటి రెండు పాత్రలతో పేరు తెచ్చుకున్నప్పటికి ఒక నటిగా అసంతృప్తిగానే ఉంది ఈ భామ. ఇటీవల ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాతో నేరుగా ఓటీటీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది శ్రద్ధా దాస్.

ఆర్య 2తో గుర్తింపు..
అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ అంతగా పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ మూవీ ఆర్య 2లో శాంతిగా ఎంతో ఆకట్టుకుంది.

ముంబైలో జన్మించిన ముద్దుగుమ్మ..
ముంబైలో 1987 మార్చి 4న జన్మించిన బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త. దీంతో శ్రద్ధా దాస్ కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి.. ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నిలిజంలో డిగ్రీ పట్టా పొందింది. నటిగా పాపులర్ అవుదామని చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగులో 2008లో విడుదలైన అల్లరి నరేష్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్ చిత్రసీలోకి అడుగు పెట్టింది ఈ ముంబై భామ శ్రద్ధా దాస్.

సెకండ్ హీరోయిన్ గా..
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం మూవీలో ప్రధాన హీరోయిన్ మంజరి ఫడ్నవీస్‌తో పాటు మరో సెకండ్ హీరోయిన్గా నటించింది. అయితే సినిమాకు హిట్ టాక్ వచ్చిన కానీ శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. అల్లరి నరేష్ సినిమా తర్వాతి సంవత్సరం 2009లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, చందమామ కాజల్ అగర్వాల్, నవదీప్ కాంబినేషన్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఆర్య 2 విడుదలైంది.

గ్లామర్ తో కనువిందు..
అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్య 2 సినిమాలో శాంతి పాత్రలో ఆర్యను ఇష్టపడే కొలిగ్ గా శ్రద్ధా దాస్ నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆర్య 2 సినిమాతో తెలుగులో శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ చిత్రం మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్.

బికినీలో హాట్ ట్రీట్..
తాప్సీ హీరోయిన్ గా నటించిన మొగుడు చిత్రంలో సినిమాలో ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులను తన హాట్ నెస్ తో ఆశ్చర్యపరిచింది శ్రద్ధా దాస్. అలా బికినీలో హాట్ గా దర్శనమిచ్చిన మొగుడు సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాలో శ్రద్ధా దాస్ అందాలను, హాట్ గా ప్రదర్శిచిన తీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరు. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి.

నేరుగా ఓటీటీలో..
శ్రద్ధా కపూర్ ఇటీవల కాలంలో మాత్రం వరుస సినిమామలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే అర్థం సినిమాతో త్వరలో ప్రేక్షకులను భయపెట్టనుంది ఈ భామ. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్.

మల్లెపూవులా శ్రద్ధా దాస్..
చీరకట్టిన, బికినీ వేసినా ఏ డ్రెస్ లో అయినా తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది శ్రద్ధా దాస్. తాజాగా మరోసారి చీరలో సోకుల విందు చేసింది ఈ అమ్మడు. తెల్ల చీర కట్టుకున్న శ్రద్ధా దాస్ మల్లెపూవును తలపిస్తోంది. నాభి అందాలను హాట్ గా చూపిస్తూ అట్రాక్ట్ చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె తాజాగా ఫొటోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గ్లామరస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాయి తెల్ల చీరలో శ్రద్ధా దాస్ అందాలు.