For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR: చరణ్, ఎన్టీఆర్ హీరోలని తెలియదు.. టికెట్లు దొరకడం లేదు.. శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

  |

  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి, విడుదలైన పాన్ ఇండియా మూవీ RRR అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదట కొంత డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అన్ని భాషలలోనూ అద్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాలో కేవలం రామ్ చరణ్ ఎన్టీఆర్ ల నటనకు మంచి మార్కులు లభిస్తున్నాయి కానీ మిగతా చాలా పెద్ద నటీనటులు కనిపించినా సరే వారికి చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించింది. అయితే ఈ విషయం మీద తాజాగా శ్రియ స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే

   సరోజినీ అనే పాత్రలో

  సరోజినీ అనే పాత్రలో

  ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అనేక సినిమాలు చేసిన శ్రియ తర్వాత కాలంలో కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఆమె ఇమేజ్ కి డామేజ్ అయింది. ఈ క్రమంలో ఆమె తాను ప్రేమించిన ఫారెనర్ ను పెళ్లి చేసుకోవడం లాక్డౌన్ సమయంలో పాపకు జన్మనివ్వడం కూడా వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఆమె సినిమాలకు దూరం అవుతుంది అని అనుకున్నారు కానీ ఆమె అనేక సినిమాలు చేస్తూ ముందుకు వెళుతోంది. ఆమె RRR సినిమా లో అజయ్ దేవగన్ కు జోడిగా సరోజినీ అనే పాత్రలో కనిపించింది.

  ఆనందంగా

  ఆనందంగా

  తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సినిమా గురించి అనేక విషయాలు ఆమె పంచుకున్నారు. ప్రస్తుతానికి కబ్జా అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. దీనికోసం ప్రస్తుతం బెంగళూరులో షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. తాను ఇంకా ఈ సినిమా చూడలేదు అని ఎందుకంటే ముంబైలో తనకు సినిమా టికెట్లు దొరకడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా సక్సెస్ ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఛత్రపతి తర్వాత ఈ సినిమా కోసం రాజమౌళితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

  కచ్చితంగా పని చేస్తా

  కచ్చితంగా పని చేస్తా

  ఛత్రపతి కోసం మొదటి సారి రాజమౌళి గారి తో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ఆ సినిమా నా కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచింది దాని తర్వాత రాజమౌళి గారి సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా నటించాలని ఎదురుచూస్తున్నా అలాంటి సమయంలో ఈ సినిమాలో అవకాశం వచ్చింది దీంతో కథ ఏమిటి అని కూడా వినకుండా అనే సినిమాలో చేస్తానని చెప్పాను అలా RRR సినిమాలో ఒక కీలక పాత్ర దక్కింది. రాజమౌళి అండ్ టీమ్ మొత్తంతో కలిసి మరోసారి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది భవిష్యత్తులో కూడా రాజమౌళి సినిమాల్లో చేసే అవకాశం వస్తే కచ్చితంగా పని చేస్తానని చెప్పుకొచ్చింది.

  టికెట్లు దొరుకుతాయని భావిస్తున్నా

  టికెట్లు దొరుకుతాయని భావిస్తున్నా

  సినిమాలో రామ్ చరణ్ తారక్ హీరోలు అనే విషయం నేను షూటింగ్ కి వెళ్ళాక తెలిసింది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మాటల్లో వర్ణించలేనంత ఆనందాన్ని నేను ఫీల్ అవుతున్నాను వాళ్ళిద్దరికీ చాలా సంవత్సరాల తర్వాత వారి స్టార్ డం కి సరిపడా హిట్ వచ్చిందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.

  అయితే తాను ఇంకా సినిమా చూడలేదని సినిమా విడుదలైన సమయంలో ముంబైలో ఉండడంతో అక్కడ కొన్ని థియేటర్లలో టికెట్ల కోసం ప్రయత్నించాను కానీ ఎక్కడా దొరకలేదు అని ఇప్పుడు షూటింగ్ కోసం బెంగళూరు వచ్చా అని చెప్పుకొచ్చారు ఇక్కడ కూడా థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయని వచ్చేవారం అయిన టికెట్లు దొరుకుతాయని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది

   విజయాలు అందుకుకోవచ్చని

  విజయాలు అందుకుకోవచ్చని

  మీది ఒక రకంగా అతిధి పాత్ర కదా అని ప్రశ్నిస్తే అతిథి పాత్ర కానీ అద్భుతంగా చెక్కిన పాత్ర. జమౌళి గారి గురించి అందరికీ తెలిసిందే ఆయన సినిమాలో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. రమా రాజమౌళి గారి కాస్ట్యూమ్స్, మహేంద్ర మేకప్ అన్నీ బాగా కుదిరాయి కొన్ని సార్లు మీరు కొంచెం చేసినా ఫలితాలు మాత్రం అద్భుతంగా వస్తాయి అందుకే రాజమౌళి సినిమాలో పాత్ర చిన్నదా పెద్దదా అనేది విషయం కాదు ఆయన విజన్ ను నమ్మి ముందుకు వెళ్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలు అందుకుకోవచ్చని ఆమె చెప్పుకొచ్చింది.

  Recommended Video

  RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
  కధ ఏమిటి

  కధ ఏమిటి

  అజయ్ దేవగన్ తో కలిసి నటించడం మీకు ఎలా అనిపించింది అంటే నాకు నిజంగా ఆయనతో కలిసి నటిస్తున్నాను అనే విషయం తెలియదు నిజం చెప్పాలంటే అసలు కధ ఏమిటి అనే విషయం కూడా తెలియదు. రాజమౌళి గారి సినిమా చేయాలి అనే ఉద్దేశంతో నేను ఎలాంటి కథ వినకుండానే ఓకే చెప్పాను సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తున్నారని ఆ తర్వాత అజయ్ దేవగన్ భార్యగా నేను నటిస్తున్నాను అనే విషయం తెలిసింది. అని శ్రియ చెప్పుకొచ్చారు.

  ఇక తన రాబోయే సినిమాల గురించి చెప్తూ ప్రస్తుతానికి రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను అని అందులో ఒకటి కబ్జా కాగా మరొకటి మ్యూజిక్ స్కూల్ అనే సినిమా చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే అజయ్ దేవగన్ తో దృశ్యం 2 అనే సినిమా కూడా చేస్తున్నానని శ్రియ వెల్లడించారు.

  English summary
  In a latest interview Shriya Saran, revealed that she didn’t know RRR’s story or the cast when she signed the film. She also revealed that she didn't manage to get tickets for the film in Mumbai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X