Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Waltair Veerayya ప్రీరిలీజ్ ఇవెంట్‌కు శ్రుతి హాసన్ దూరం.. ఇదే కారణం! ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?
లోక నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ శ్రుతి హాసన్. పేరుకు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తనదైన శైలీలో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. శ్రుతి హాసన్ నటనలోనే కాకుండా గొప్ప సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది. అయితే శ్రుతి హాసన్ కు మొదట్లో అటు హిందీలో, ఇటు తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమాలతో అంతగా అదృష్టం కలిసిరాలేదు. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలందరికీ గోల్డెన్ గర్ల్ గా మారిపోయింది ఈ బ్యూటి. అందుకు ఉదాహరణ ఇటీవలే శ్రుతి హాసన్ నా లక్కీ హీరోయిన్ అని వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ గోపిచంద్ చెప్పడం. అయితే ఈ లక్కీ హీరోయిన్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టింది. కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే..

అగ్ర హీరోలతో నటించి..
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్ శ్రుతి హాసన్. అయితే తెలుగులో తెరంగేట్రం చేసిన అనగనగా ఓ ధీరుడు, హిందీలో లక్ మూవీ అంతగా విజయం సాధించలేదు. కానీ తర్వాత రానురాను తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అగ్ర హీరోలతో ఆమె నటించిన సినిమాలన్ని దాదాపుగా సూపర్ హిట్ సాధించాయి. అయితే తర్వాత సినిమాలకు కొంతకాలం గ్యాప్ తీసుకుంది ఈ ముద్దుగుమ్మ.

రెండు పెద్ద సినిమాల్లో..
టాలీవుడ్‌లోకి
ఈ
మధ్యనే
రీఎంట్రీ
ఇచ్చిన
శృతి
హాసన్..
వరుస
సినిమాలతో
సందడి
చేస్తోంది.
ఇప్పటికే
ఈ
అమ్మడు
పాన్
ఇండియా
స్టార్
ప్రభాస్‌తో
'సలార్'
అనే
సినిమాను
చేస్తోంది.
అలాగే
బాలకృష్ణ-గోపీచంద్
కాంబినేషన్‌లోని
వీర
సింహా
రెడ్డి,
చిరంజీవి-బాబీ
కాంబోలోని
వాల్తేరు
వీరయ్య
సినిమాలోను
శ్రుతి
హాసనే
హీరోయిన్.
సంక్రాంతి
కానుకగా
బరిలోకి
దిగిన
రెండు
పెద్ద
సినిమాల్లో
శ్రుతి
హాసనే
హీరోయిన్
గా
చేయడం
విశేషం.

వీర సింహా రెడ్డి ఈవెంట్ లో..
అంతేకాకుండా రెండు బాడా స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ నటించిన తాజా సినిమాలకు ఒకటే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడం మరో విశేషం. ఇటీవలే బాలకృష్ణ వీర సింహా రెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో కూడా శ్రుతి హాసన్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరగనుంది.

వింటేజ్ లుక్ లో చిరు..
మెగా స్టార్ చిరంజీవి-మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 7న విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో చిరంజీవి, రవితేజ ఇద్దరి మధ్య గట్టి వార్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి వింటేజ్ లుక్ లో అదరగొట్టాడు. దీంతో మెగా ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి.

ఫైనల్ గా అక్కడ వేదిక..
ఇక జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న అంటే ఇవాళ విశాఖలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేదిక ఆఖరుకు ఫిక్స్ అయింది. మూడుసార్లు ప్రదేశం మారగా ఫైనల్ గా.. చిత్రబృందం విజ్ఞప్తి మేరకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో కార్యక్రమం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతులు ఇచ్చారు.

హాజరు కాని శ్రుతి హాసన్..
ఇవాళ విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇప్పటికే చిత్రబృందం చేరుకున్నట్లు సమాచారం. కానీ ఈ కార్యక్రమానికి హీరోయిన్ శ్రుతి హాసన్ మాత్రం రావడం లేదు. అందుకు గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. పలు అనారోగ్య కారణాల వల్లే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోతున్నట్లు అందులో వెల్లడించింది శ్రుతి హాసన్.

గొప్పగా ఉందన్న శ్రుతి హాసన్..
"నేను నా అనారోగ్యం కారణంగా వాల్తేరు వీరయ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోతున్నందుకు నా గుండె ముక్కలైపోతుంది. నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. అస్సలు ఇది భరించడం ఇవాళ నావల్ల కావట్లేదు. నేను ఈరోజు ఏమాత్రం రాలేను. ఈ సినిమాలోచిరంజీవి గారితో పనిచేయడం చాలా గౌరవంగా, గొప్పగా ఉంది. ఈ ఈవెంట్ చాలా విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నా. నేను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది" అని శ్రుతి హాసన్ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. మరి వీర సింహా రెడ్డి ఈవెంట్ కు వచ్చి.. చిరంజీవి ఫంక్షన్ కు రాకపోతే శ్రుతి హాసన్ పై మెగా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.