Shruti Haasan ఆరోగ్య విషమం.. షాకింగ్‌గా వార్తలు.. శృతిహాసన్ వీడియో రిలీజ్

తెలుగు, ఇతర భాషా చిత్రాలతో బిజీగా ఉంటున్న శృతిహాసన్‌పై పలు రూమర్లు వైరల్ అయ్యాయి. తన ఆరోగ్యం గురించి ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో వెల్లడించగా.. ఆ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకొన్న మీడియా.. ఆమె ఆరోగ్యంపై తప్పుడు కథనాలు వెల్లడించాయి. అయితే తన ఆరోగ్యం గురించి తప్పుడు కథనాలు రావడంతో శృతిహాసన్ వీడియోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. అయితే శృతి హాసన్ షేర్ చేసిన పోస్టు ఏమిటి? ఆమె వీడియోలో ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..

తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నా

తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నా

ఇటీవల శృతీ హాసన్ వర్కవుట్ వీడియోను పోస్టు చేసి.. నాతో వర్కువుట్ చేయండి. నేను పీసీవోఎస్, ఎండోమెట్రీయోసిస్ అనే హార్మోనల్ మార్పుల వ్యాధితో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాను. హార్మోన్ల సమతూల్యత లేకపోవడం ఎంత కష్టమో మహిళలకు తెలుసు. ఆ సమస్యను అధిగమించేందుకు నేను ఓ పోరాటమే చేస్తున్నాను అని శృతి హాసన్ చెప్పింది.

ఫిట్‌గా హ్యాపీగా ఉండండి..

ఫిట్‌గా హ్యాపీగా ఉండండి..


అయితే ప్రస్తుతం నేను మంచి ఫుడ్ తింటున్నాను. సమయానికి నిద్ర పోతున్నాను. వర్కువుట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. అయితే నా శరీరం బాగా లేకపోయినా.. నా హృదయం, మనసు బాగుంది. మీరు కూడా ఫిట్ కూడా ఉండండి. హర్మోన్ల సమతుల్యత దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకొంటూ హ్యాపీగా ఉండండి అని శృతిహాసన్ తెలిపారు. ఈ పోస్టు చూసిన తర్వాత ఆమె ఆరోగ్యం విషమంగా మారిందంటూ కథనాలు వచ్చాయి.

తన ఆరోగ్యంపై రూమర్ల రావడంతో

తన ఆరోగ్యంపై రూమర్ల రావడంతో


తన ఆరోగ్యం గురించి కథనాలు రావడంతో వీడియో ద్వారా స్పందించారు. నేను వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాను. హైదరాబాద్‌ లాంటి మహానగరం వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీకు నేను ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలని అనుకొంటున్నాను. నేను రెగ్యులర్ వర్క్‌లో ఉన్నాను. చాలా మంది మహిళలు ఎదుర్కొన్నట్టుగానే నాకు పీసీవోఎస్ (మహిళలకు సంబంధించిన సమస్య)తో బాధపడుతున్నాను. అయితే ఆ విషయంపై రూమర్లు రావడం నా టీమ్‌ దృష్టికి వచ్చింది అని శృతిహాసన్ వెల్లడించారు.

 మహిళలకు ఓ ఛాలెంజ్

మహిళలకు ఓ ఛాలెంజ్


పీసీవోఎస్ అనే సమస్య చాలా మంది మహిళలకు ఉంటుంది. ఆ సమస్యను అధిగమించడం మహిళలకు అది ఛాలెంజ్. అయితే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని. అలాగే నా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తను ఓ మీడియా హౌస్ ప్రచారం చేసింది. అయితే వాస్తవాలు తెలుసుకోకుండానే నా హెల్త్‌పై రూమర్లు క్రియేట్ చేయడం బాధగా ఉంది అని శృతిహాసన్ ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్పిటల్‌లో ఉంటే.. ఇలా ఉంటానా?


అయితే నా ఆరోగ్య పరిస్థితిని గోరంతలు, కొండంతలు చేసి కథనాలు అల్లినారు. ఒకవేళ నేను హాస్పిటల్ ఉంటే.. కారులో ఇలా ఎలా ఉంటాను. ఈ రేంజ్‌లో హెల్తీగా ఉండగలనా? నేను షూటింగులకు హాజరవ్వగలనా? కాబట్టి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. అయితే నా ఆరోగ్యం గురించి తెలుసుకొని ఆందోళన పడిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్. ఈ విషయాన్ని నేను క్లియర్‌గా చెప్పడానికే నేను ఈ వీడియోను రిలీజ్ చేశాను. మీరు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకొంటున్నాను అని శృతిహాసన్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X