రెండో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్.. బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ పోస్ట్
అనివార్య కారణాలతో జీవిత భాగస్వామి మరణించినా, విడాకులు తీసుకున్నా రెండో పెళ్లి చేసుకునే కల్చర్ ఇటీవలి కాలంలో ఎక్కువైంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఈ విషయంలో మారుతున్నారు. సింగర్ సునీత, అక్కినేని నాగచైతన్యతో పాటు పలువురు నటీనటులు రెండో పెళ్లి చేసుకున్న వారే. మరికొందరైతే మూడో పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించాలని చూస్తున్నారు హీరోయిన్ ఎస్తేర్ నొరొన్హా. ఈ వివరాల్లోకి వెళితే..
బాలనటిగా ఎంట్రీ
కర్ణాటలోని ఉడిపికి చెందిన ఎస్తేర్.. ముంబైలో చదువుకున్నారు. బాలనటిగా పలు కొంకణి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. బారొమాస్ అనే హిందీ చిత్రం ద్వారా 2012లో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబద్ధాలు సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు ఎస్తర్. ఆ వెంటనే భీమవరం బుల్లోడు సినిమాలో ఆమె నటించారు. ఆ తర్వాత గరం, జయ జానకి నాయక, ఐరావతం, 69 సంస్కార్ కాలనీ, చెంగురే బంగారు రాజా, డెవిల్, టెనెంట్, థలా అనే సినిమాల్లో నటించారు.

నోయెల్‌తో పెళ్లి, విడాకులు
ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో త్వరగానే ఫేడవుట్ అయిపోయింది. మధ్యమధ్యలో చిన్నా చితకా చిత్రాల్లో నటించినా ఎస్తేర్‌కు అంతగా గుర్తింపు రాలేదు. కొంతకాలానికే సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే పెళ్లయిన కొద్దికాలానికి దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాదికే ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. విడాకుల తర్వాత తనకు నచ్చినట్లుగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. రొమాంటిక్ సీన్స్‌లోనూ రెచ్చిపోయింది. 69 సంస్కార్ కాలనీ సినిమాతో పాటు రెక్కీ వెబ్ సిరీస్‌లో ఎస్తేర్ అందాల విందు చేసింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్
సినిమాలు చేసినా చేయకున్నా సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండటంతో పాటు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోంది ఎస్తేర్. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం తన పెళ్లి, విడాకులు, కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నోయెల్ తనను టార్చర్ చేసేవాడని, అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందన్న కోణంలో ఆరోపణలు చేసింది. అయితే వీటిని నోయెల్ ఖండించారు. ఎస్తేర్‌తో మొదట్లో జీవితం చాలా బాగుందని కానీ ఆ తర్వాత నాపై లేనిపోనివి చెప్పడం మొదలుపెట్టిందని నోయెల్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకొచ్చిన ఆఫర్లు కూడా చేజారిపోయాయని తెలిపారు. తను ఏమన్నా తనంటే నాకు ఎంతో ఇష్టమని నోయెల్ పేర్కొన్నారు.
బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ పోస్ట్
ఇదిలాఉండగా.. ప్రస్తుతం నోయెల్‌కు ఎలాంటి ఆఫర్లు లేవు. చిన్నాచితకా సినిమాలలో నటిస్తున్నా, గ్లామర్ షో చేసుందుకైనా, లిప్‌లాక్స్‌కు రెడీ అంటున్నా ఆమెను పట్టించుకునేవారే లేరు. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా వాటిని నిజం చేసేలా పోస్ట్ పెట్టింది ఎస్తేర్ నొరొన్హా. క్రైస్తవ మహిళలు వివాహ సమయంలో ధరించే తెల్ల రంగు గౌను ధరించి.. పడవలో వెళ్తూ చేపలతో ఆడుకుంటున్న ఫోటోను ఆమె షేర్ చేశారు. అలాగే జీవితంలో మరో అందమైన సంవత్సరమని, అవకాశాలు, అద్భుతాలను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజు నాడు నాపై ప్రేమను, ఆశీర్వాదాలను కురిపిస్తోన్న మీ అందరికీ ధన్యవాదాలు. మీతో ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంటున్నాను.. త్వరలోనే అది వస్తుంది, వేచి ఉండండి అని ఎస్తేర్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎస్తేర్ రెండో పెళ్లి గురించిన అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











