For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి లక్కీ హీరోయిన్ పై ఫోకస్ పెట్టిన అల్లు అర్జున్.. ఐకాన్ కోసం ఇద్దరు బ్యూటీలు?

  |

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో గాని ఆ సినిమాపై మాత్రం పెరుగుతున్న అంచనాలు మాత్రం మామూలుగా లేవు. ఫస్ట్ లుక్ టీజర్ తోనే సౌత్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. తెలుగులో అత్యధిక వ్యూవ్స్ అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో లైక్స్ అందుకున్న టీజర్ గా కూడా పుష్ప మొదటి స్థానంలో నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా తప్పకుండా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని క్రియేట్ చేస్తున్న హైప్ తోనే అర్థమవుతోంది.

  రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కు కూడా ఈ సినిమా మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మ్యూజిక్ విషయంలో అంచనాలకు తగ్గట్లుగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈనెల 13న మొదటి పాటను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప సంగతి పక్కన పెడితే ఆ సినిమా అనంతరం అల్లు అర్జున్ ఐకాన్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. వకీల్ సాబ్ కంటే ముందే ఈ ప్రాజెక్టు ఓకే అయినప్పటికీ అల్లు అర్జున్ బిజీగా ఉండడం వల్ల వెంటనే మొదలు పెట్టలేక పోయాడు.

  Stylish star Allu arjun icon movie latest update on heroine issue

  ఇక ఇప్పుడు పుష్ప పూర్తయిన వెంటనే ఈ సినిమాను కేవలం మూడు నెలల్లో ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు. అందుకే దర్శకుడు వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోమ్మని కూడా మంచి సలహా ఇచ్చాడట. ఇక హీరోయిన్స్ విషయాల్లో కూడా ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బన్నీకి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ ను అనుకుంటున్నారట. ముందుగా మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. మరో హీరోయిన్ ఎవరనే విషయం పై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అల్లు అర్జున్ తో పూజ హెగ్డే ఇదివరకే రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం 'డీజే' సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు.

  ఇక ఇప్పుడు కూడా మరోసారి రొమాన్స్ చేసే ఛాన్స్ అన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఐకాన్ సినిమా అనంతరం అల్లు అర్జున్ పుష్ప సినిమా సెకండ్ పార్ట్ పై ఫోకస్ పెట్టుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఐకాన్ తర్వాత పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. పుష్ప పాటలు ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇక వారు అనుకున్నట్లుగా పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయి చూడాలి.

  English summary
  Stylish star Allu arjun icon movie latest update on heroine issue and movie schedule target,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X