Sushmita Sen వాళ్లతో గడపడాన్ని ఇష్టపడుతా.. కానీ మోసం చేయొద్దు.. బ్రేకప్ తర్వాత సుస్మిత పోస్టు
ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ సుస్మిత సేన్ జీవితంలో మరోసారి బ్రేకప్ జరిగింది. మూడేళ్లుగా సహ జీవనం చేస్తున్న రోహ్మన్ షా, సుస్మితా సేన్ విడిపోవడం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తమ రిలేషన్‌షిప్, బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో వెల్లడిస్తూ నర్మగర్బమైన పోస్టును తాజాగా పెట్టడం మరోసారి చర్చకు దారి తీసింది. సుస్మితా సేన్ పెట్టిన పోస్టు ఏమిటంటే..

సుస్మిత సేన్ అఫైర్లు, బ్రేకప్స్
సుస్మితా సేన్ ముంబైకి చెందిన ఓ రెస్టారెంట్ బిజినెస్ మ్యాన్‌తో తొలి అఫైర్ కొనసాగించింది. వారిద్దరూ 2017లో విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా, సోనాక్షి సిన్హా ప్రియుడిగా చెప్పుకొంటున్న బంటీ సజ్దేహ్‌తో, దర్శకుడు విక్రమ్ భట్, సంజయ్ నారంగ్‌తో, హాట్‌మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో, దర్శకుడు ముదస్సర్ అజిజ్‌తో, అలాగే క్రికెటర్ వసీం అక్రమ్‌తో అఫైర్, డేటింగ్ చేసినట్టు మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి.

15 ఏళ్ల చిన్నవాడితో రొమాన్స్
సుస్మిత సేన్ తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్ షాతో మూడేళ్ల క్రితం రిలేషన్‌షిప్ ప్రారంభించింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ఓ చేశారు. సుస్మిత సేన్‌తోపాటు తన దత్త పుత్రికలు రీనీ, అలిషాతోపాటు రోహ్మాన్ కుటుంబంగా మారిపోయారు. చక్కటి ఫ్యామిలీగా అభిమానులకు బిల్డప్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా బ్రేకప్ విషయాన్ని బయటపెట్టారు.

ఫ్రెండ్స్‌గా కలిశాం.. విడిపోయాం..
రోహ్మన్ షాతో బ్రేకప్ గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో సుస్మితా సేన్ పోస్టు పెడుతూ.. మేము ఫ్రెండ్స్‌గా కలిశాం. ఇక ముందు కూడా మేము ఫ్రెండ్స్‌గానే ఉంటాం. మా మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఇక ఉండదు. కానీ మా మధ్య లవ్ అలానే ఉంటుంది. ఇంతకంటే మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు అంటూ సుస్మితా సేన్ ఇన్స్‌టాగ్రామ్‌లో తెలిపారు.

నాతో ప్రయాణం కొనసాగించినందుకు
రోహ్మన్ షాతో బ్రేకప్ తర్వాత సుస్మితా సేన్ నర్మగర్బంగా పోస్టు పెడుతూ.. జీవితంలో వ్యక్తులతో గడపడాన్ని ఆస్వాదిస్తాను.. ప్రేమిస్తాను. కానీ ఆ బంధంలో నమ్మకం కలిగించాలి నా సలహా. నాతో ప్రయాణం కొనసాగించినందుకు థ్యాంక్యూ. అయినా ఐ లవ్ యూ గయ్స్.. #duggadugga ❤️ Alisah, reneesen47 & #yourstruly అంటూ సుస్మితా సేన్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టారనేది ఆసక్తిగా మారింది.

సుస్మితా సేన్ సినీ కెరీర్ ఇలా..
సుస్మితా సేన్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌లో ఆర్య అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్రను పోషించడమే కాకుండా టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత ఆమె నటించిన ఆర్య 2 సీజన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీజన్‌లో కూడా సుస్మిత నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.


Click it and Unblock the Notifications











