Tamannaah Bhatia: అతనికి భార్యను కాబోతున్నా.. సైలెంట్‌గా షాకిచ్చిన తమన్నా భాటియా

టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలంతా ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఎప్పుడు? ఎవరు? రిలేషన్‌లో ఉంటారో? ఎవరు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిస్తారో తెలియడం లేదు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పెళ్లిపై సైలెంట్‌గా బాంబు పేల్చారు.పెళ్లికి రెడీ అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

20 ఏళ్ల కెరీర్ పూర్తి
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కొనసాగడం అన్నది వారి అదృష్టం, సినిమాల సక్సెస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. సావిత్రి, భానుమతి, జమున, విజయశాంతి, శ్రీదేవి, జయప్రద వంటి తారలు దశాబ్ధాల పాటు తమ కెరీర్‌ను సాగించి హీరోలను మించిన స్టార్‌డమ్ అందుకుని లేడీ సూపర్‌స్టార్లుగా వెలుగొందారు. అయితే ఈ జనరేషన్‌లో హీరోయిన్ల కెరీర్ రెండు మూడేళ్లకే ముగిసిపోతోంది. వరుసగా హిట్స్ వస్తే కొన్నాళ్లు ఇండస్ట్రీలో కంటిన్యూ కావొచ్చు. ఆ తర్వాత హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడమే. అలాంటిది దాదాపు 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడంతో పాటు ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న వారిలో తమన్నా భాటియా కూడా ఒకరు.

Tamannaah Bhatia make sensational comments on Marriage and Future Husband

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్
15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా అడుగుపెట్టిన తమన్నా భాటియా... హ్యాపీడేస్‌తో కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఛాన్స్‌లు అందుకుని దక్షిణాదిలో నెంబర్‌వన్ హీరోయిన్‌గా నిలిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటిస్తూ అదే స్టార్ డమ్ కంటిన్యూ చేస్తున్నారు. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం నెంబర్ల ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచారు తమన్నా. జైలర్, స్త్రీ 2, రైడ్ 2 సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కుర్రకారును ఊపేశాయి.

విజయ్ వర్మతో బ్రేకప్
కెరీర్ బిగినింగ్ నుంచి ఎఫైర్లకు, ప్రేమాయణాలకు దూరంగానే ఉన్న తమన్నా భాటియా.. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో తనతో కలిసి నటించిన విజయ్ వర్మతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి వెకేషన్స్‌కు హాజరుకావడం, చెట్టాపట్టాలేసుకుని తిరుతుండటంతో మీడియాకు డౌట్ కొట్టింది. దాంతో తమన్నా, విజయ్ వర్మ మధ్య ఏదో జరుగుతోందని మీడియా కోడై కూసింది. వీటికి తెరదించుతూ తమన్నా, విజయ్‌లు బహిరంగంగానే తమ రిలేషన్‌లో ఉన్నట్లు ప్రపంచానికి తెలియజేశారు. ఈ ఏడాది ఖచ్చితంగా పెళ్లి చేసుకునే జంటల్లో తమన్నా- విజయ్ వర్మ ఉంటారని అంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తూ వీరు విడిపోయి సినీ పరిశ్రమకు, అభిమానులకు షాకిచ్చారు.

సినిమాలలో బిజీగా తమన్నా
బ్రేకప్ తర్వాత విజయ్ వర్మ.. దంగల్ నటి ఫాతిమతో డేటింగ్ చేస్తుండగా.. తమన్నా తన సినిమాలు, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డూ యూ వాన్నా పార్ట్‌నర్ అనే వెబ్‌సిరీస్‌లో తమన్నా భాటియా నటించారు. సెప్టెంబర్ 12 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తమన్నా ఓ ఛానెల్‌లో మాట్లాడుతూ పెళ్లి, కాబోయే భర్త గురించి తేల్చేసింది.

నా భర్తను త్వరలోనే చూస్తారు
మంచి లైఫ్ పార్ట్‌నర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.. ఎంతో పుణ్యం చేసుకుంటే తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందించాలి. అతను ఎవరె నాకు కూడా తెలియదు, త్వరలోనే ఆ అదృష్టవంతుడిని మీరంతా చూస్తారేమోనని తమన్నా హింట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమన్నా మళ్లీ ప్రేమలో పడ్డారా? లేక ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారా? అంటూ షాక్ అవుతున్నారు. దీంతో తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X