Don't Miss!
- Finance
SBI Q3 Result: రికార్డు లాభాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్.. అంచనాలను తలదన్నేలా..
- News
తెలంగాణా బడ్జెట్ హైలైట్స్: బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట; కేసీఆర్ మార్క్ బాహుబలి బడ్జెట్ కేటాయింపులిలా!!
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కోలీవుడ్ లో మరో గొల్డెన్ ఛాన్స్ కొట్టేసిన తమన్నా
మిల్కీబ్యూటీగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న తమన్నా భాటియా ఇటీవల మరింత స్పీడ్ పెంచింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత తమన్నా మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ నేటితరం యువ హీరోయిన్స్ కు గట్టిపోటీని ఇస్తోంది. తెలుగులో ప్రస్తుతం సీటీమార్ అనే సినిమా చేస్తున్న అమ్మడు కోలీవుడ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
కోలీవుడ్ హీరో ధనుష్ తన అన్న సెల్వరాఘవన్ తో ఒక సినిమా చేయనున్నట్లు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నానే వరువేన్ అనే ఆ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మొదట డేట్స్ కారణంగా కాస్త సందేహీంచినప్పటికి ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.కేవలం హీరోయిన్ గానే కాకుండా పలు సపోర్టింగ్ రోల్స్ చేయడానికి తమన్నా రెడీ అవుతోంది.

ఇక షోలకు హోస్ట్ గా చేయడానికి కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే యాంకర్ గా కూడా క్లిక్కవ్వాలని డిసైడ్ అయ్యిందట. త్వరలోనే ఒక టాక్ షో ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను సరికొత్తగా ఎట్రాక్ట్ చేయనుంది. ఇక ఆమె ఆ టాక్ షో కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోందట. తమన్నా టాక్ షో ప్రసారం కాబోయేది ఆహా యాప్ లోనే అని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.