Don't Miss!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Travel
వస్త్ర ప్రపంచానికి మన పెడన కలంకారి ఓ అలంకరణ!
- News
Jayalalithaa: జయలలిత కేసులో మళ్లీ ?, టైమ్ కావాలి సార్, ట్విస్ట్ లు, సీబీసీఐడీ ఎంట్రీ !
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
బ్యాక్ గ్రౌండ్ లేదు.. అయినా కూడా మేము సక్సెస్ కావడం లేదా: నెపోటిజంపై తమన్నా సెటైర్
సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎన్నోసార్లు నెపోటిజమ్ పై అనేక రకాల వాదనలు వచ్చాయి. కానీ అవి హెడ్ లైన్స్ లోనే నిలుస్తున్నాయి కానీ ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాంతరం నెపోటిజమ్ ఊహించని స్థాయిలో హాట్ టాపిక్ గా మారుతోంది. కొందరు దీన్ని తప్పు అంటున్నా మరికొందరు మాత్రం టాలెంట్ ఉన్నవాడే ఇండస్ట్రీలో ఉంటాడని అంటున్నారు. ఇక హీరోయిన్స్ పై తమన్నా తనదైన శైలిలో అలా కామెంట్ చేసింది.

అలా ఉండడం చాలా కష్టమైన పని
హీరోలకంటే హీరోయిన్స్ మధ్యన నిత్యం పోటీ జరుగుతూనే ఉంటుంది. ఆడియెన్స్ ని బోర్ కొట్టించకుండా ఒక వైవు గ్లామర్ తోను మరోవైపు నటనతోను ఆకట్టుకోవాలి. నిత్యం ఫిట్నెస్ పై జాగ్రత్తలు తీసుకుంటూ అందం కూడా పాడవ్వకుండా చూసుకోవాలి. నిజంగా హీరోయిన్ గా ఉండడం చాలా కష్టమైన పని అని చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. ఇక తమన్నా కూడా అదే అంటోంది.

ప్రతిభ ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో ఉంటారు
ఒక ఇంటర్వ్యూలో తమన్నా హీరోయిన్స్ టాలెంట్ గురించి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఒక విధంగా ఆమె నెపోటిజమ్ అనే దానికి కౌంటర్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. ఫైనల్ గా ప్రతిభ ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో ఉంటారని అంటూ.. ప్రస్తుతం తనతో పాటు అలాంటి వారు చాలా మంది ఉన్నారని మాట్లాడింది.

బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే..
బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సినిమాలో రానిస్తారనే మాటను నేను నమ్మను. ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన టాలెంట్ కి తగ్గట్టు మనం వాటిని సంక్రమంగా ఉపయోగించుకోవాలి. నేను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాను. సినిమా వాళ్ళు ఎవరు కూడా నా వెనుక లేరు. అయినప్పటికీ వరుసగా అవకాశాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను.
Recommended Video

అందుకు మేమే నిదర్శనం
నేనే కాదు. సమంత అనుష్క, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే..ఇలా చాలా మందికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమి లేదు. అయినప్పటికీ వాళ్ళు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అందుకు కారణం వారి టాలెంట్. ఇక్కడ టాలెంట్ తో పాటు విజయాలు మాత్రమే మాట్లాడతాయి. అందుకు మేమే నిదర్శనం.. అంటూ తమన్నా తనదైన శైలిలో వివరణ ఇచ్చిందిమ్