For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్కూల్‌లోనే చీట్ చేసేదాన్ని, ముద్దు పెట్టె సందర్భంలో అలా చేశా: తెలుగు హీరోయిన్ ఈషా

  |

  గ్లామర్ గీతను దాటకుండా క్రేజ్ అందుకోవడం అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టమైన పని. దానికి చాలా అదృష్టం కూడా ఉండాలి అంటారు. అయితే అలాంటి బ్యూటీలలో ఈషారెబ్బ ఒకరు. ఈ తెలుగమ్మాయి ఎక్కువగా హాట్ రోల్స్ చేయలేదు గాని అప్పుడప్పుడు కాస్త గ్లామర్ తో కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకుంటోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

  సినిమా అవకాశాలు తగ్గినప్పుడు..

  సినిమా అవకాశాలు తగ్గినప్పుడు..

  ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ కాస్త బోల్డ్ లుక్ లో కూడా కనిపిస్తు ఫోటో షూట్స్ తో సరికొత్త కిక్కిస్తోంది. ఇక సినిమా అవకాశాలు తగ్గినప్పుడు ఆడియెన్స్ మరచిపోకుండా ఈ విదంగా కనెక్ట్ అవుతున్న ఈషా ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పలు విషయాలపై చర్చించింది. వారు అడిగిన బోల్డ్ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పింది.

  కిస్ ఇవ్వాలని అనుకుంటే..

  కిస్ ఇవ్వాలని అనుకుంటే..

  ఈషా రెబ్బ తన జీవితంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక కిస్ స్టోరీ గురించి చెప్పింది. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి ముద్దు పెట్టుకోవాలని చాలానే ప్రయత్నం చేశాడు. కానీ నేనే వద్దని వారించాను అని చెప్పుకొచ్చింది. ఇక ఆ కిస్ ఇవ్వబోయిన వ్యక్తి బాయ్ ఫ్రెండా లేక కాబోయే వాడా అనే విషయాన్ని మాత్రం చెప్పులేదు. కేవలం కిస్ చేయబోతుంటే రిజెక్ట్ చేశానని పేర్కొంది.

  స్కూల్ లోనే చీట్ చేశాను..

  స్కూల్ లోనే చీట్ చేశాను..

  ఇక చిన్నప్పుడు స్కూల్ లో చేసిన అల్లరి వేశాలను కూడా చెప్పుకొచ్చింది ఈషా. ఎక్కువగా బబుల్ గమ్ తిన్న తరువాత దాని టేబుల్ కింద అంటించేదాన్ని అంటూ నవ్వుతూ చెప్పేసింది. ఇక పరీక్ష కష్టమని తెలిస్తే ఆ రోజు ఒక ప్లాన్ వేసేదట. చాలాసార్లు చీటింగ్ కూడా చేసినట్లు సమాధానం ఇచ్చింది. స్కూల్ దశలో వేసిన అల్లరి వేషాలు ఎప్పటికైనా ఒక తీపి జ్ఞాపకాలని అంటోంది.

  మొహమాటం లేకుండా సమాధానం చెప్పింది

  మొహమాటం లేకుండా సమాధానం చెప్పింది

  ఇక కొన్ని కష్టమైనా ప్రశ్నలకు కూడా ఈషా మొహమాటం లేకుండా సమాధానం చెప్పింది. అనుకొని పరిస్థితులలో చెప్పకుండా ఎవరిదైనా టూత్ బ్రష్ వాడవా అనే ప్రశ్నకు యాక్ అంటూ ఆన్సర్ ఇచ్చిన ఈ తెలుగు బ్యూటీ అలాంటి పనులను ఎప్పుడు చేయలేదని విభిన్నమైమ హావభావాలతో ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. అలాంటి పనులు జీవితంలో ఎన్నటికి కూడా చేయనని తెలిపింది.

  నెక్స్ట్ వెబ్ సిరీస్ తో సరికొత్తగా..

  నెక్స్ట్ వెబ్ సిరీస్ తో సరికొత్తగా..

  ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ తెలుగు లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో రానుంది. సంకల్ప్ రెడ్డి, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్ వంటి వారు డైరెక్ట్ చేస్తున్న ఆ వెబ్ సిరీస్ లో హిందీ కంటే హై లెవెల్లో బోల్డ్ కంటెంట్ ఉంటుందట. అమ్మాయిలు శృంగారానికి సంబంధించిన విషయాలపై దీర్ఘంగా ఆలోచిస్తూ ఎలాంటి ఫీలింగ్స్ తో ఉంటారనే విషయాలు ఈ కథలో మెయిన్. ఇక లాక్ డౌన్ అనంతరం ఈ సిరీస్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నెట్ ఫ్లిక్స్ లోనే ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

  Director Shankar Views On Releasing Movies Directly In OTT
   ఆ పాత్ర ఎలా ఉంటుందో..

  ఆ పాత్ర ఎలా ఉంటుందో..

  లస్ట్ స్టోరీస్ లలో ఎవరి పాత్ర ఎలా ఉన్నా కూడా అందరు ఎక్కువగా ఎదురుచూస్తున్నది మాత్రం ఈషా రెబ్బ పాత్ర కోసమే. అందులో ఉండే బోల్డ్ పాత్రను అమ్మడు తెలుగులో ఎలా చేసింది. బెడ్ సీన్ లో ఎలా నటించి ఉంటుంది అనే ఆలోచన అందరిలో ఆసక్తిని రేపుతోంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  The webcams got a good craze for the lock down blow. On the one hand, the cinema shootings stopped on the spot and many of the lives of the film industry were financially damaged. However, those who are part of the OTT Flat Farm are getting good craze no matter what their circumstances are. A category audience is also looking forward to the upcoming Lust Stories in Telugu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X