బాలకృష్ణకు లవర్, భార్య, తల్లిగా... నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
సినీ పరిశ్రమ విచిత్రమైనది.. ఇక్కడ హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడా అనేది నామమాత్రం. తనకు చెల్లెళ్లుగా, అక్కలుగా, కూతుళ్లుగా, మనవరాళ్లుగా నటించిన నటీమణులతో హీరోలు రొమాన్స్ చేసిన సినిమాలు ఎన్నో. ఇక్కడ కేవలం నటననే చూడాలి, తెరపై పాత్రలే కనిపించాలి తప్పించి మరో విషయానికి తావు లేదని విశ్లేషకులు చెబుతుంటారు. హీరో హీరోయిన్లు కూడా ఈ విషయంలో ఎంతో పరిణితితో ఆలోచిస్తుంటారు. ఒకే హీరోకు లవర్‌గా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్లు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. తాజాగా గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణకు ప్రియురాలిగా, అమ్మగా, భార్యగా నటించిన ఓ హీరోయిన్ సంగతి చూస్తే.
షబానా అజ్మీకి మేనకోడలు
90వ దశకంలో తన అందచందాలు, నటనతో టాలీవుడ్, బాలీవుడ్‌లను ఒక ఊపు ఊపారు టబు. వైట్ స్కిన్ టోన్, మత్తెక్కించే కళ్లు, ఆకట్టుకునే రూపంతో అప్పట్లో కుర్రాళ్లకు కలల రాకుమారిగా నిలిచారు టబు. టాలీవుడ్‌తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా హాలీవుడ్‌లోనూ నటించింది. హైదరాబాద్‌కు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి టబు. ఆమె అసలు పేరు తబుస్సమ్ హష్మీ. బాలీవుడ్ దిగ్గజ నటి షబానా అజ్మీకి టబు స్వయానా మేనకోడలు. టబు చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. సినిమాలపై ఆసక్తితో చిన్నప్పుడే ముంబై చేరుకుని అవకాశాల కోసం ప్రయత్నించారు.

బాలనటిగా ఎంట్రీ
తొలుత 11 ఏళ్ల వయసులోనే బాలనటిగా బజార్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర పోషించిన టబు .. అనంతరం హమ్ నే జవాన్‌లో నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు కళ్లలో పడ్డారు టబు. ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నెంబర్ 1తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 1991లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్‌తో కెమిస్ట్రీకి తోడు తన అందాలతో ఓవర్‌నైట్ స్టార్‌గా నిలిచింది టబు. తర్వాత సిసింద్రీలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. నిన్నేపెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, షాక్, ఇది సంగతీ, పాండురంగడు వంటి తెలుగు చిత్రాల్లో నటించి ఆపై తన చూపును బాలీవుడ్‌పైనే పెట్టింది.
టబు ఐకానిక్ రోల్స్
ప్రేక్షకులకు టబు అనగానే కొన్ని ఐకానిక్ రోల్స్ గుర్తొస్తాయి. మాచిస్‌లో తిరుగుబాటుదారుగా వీరన్ పాత్రలో, చాందిని బార్‌లో బార్ డ్యాన్సర్‌గా, అంధాదున్ వంటి చిత్రాలతో సవాల్ చేసే పాత్రలనే ఎంచుకున్నారు టబు. దాదాపు 16 ఏళ్ల తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చిన టబు.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల బ్లాక్‌బస్టర్ మూవీ అల వైకుంఠపురంలో బన్నీకి తల్లిగా నటించారు. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, మరాఠీలతో పాటు హనుమాన్, ది నేమ్‌సెక్, లైఫ్ ఆఫ్ పై వంటి ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించారు.
స్టార్ హీరోలతో ప్రేమాయణం?
రెండు సార్లు జాతీయ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో పాటు 2011లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 53 ఏళ్ల టబు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో సంజయ్ కపూర్, సాజిద్ నదియాడ్‌వాలా, అక్కినేని నాగార్జున, అజయ్ దేవగణ్ వంటి స్టార్ హీరోలతో ఆమె ప్రేమాయణం నడిపినట్లు చిత్ర సీమలో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.
బాలయ్యకు లవర్‌గా, తల్లిగా, భార్యగా
ఇకపోతే.. నటసింహం నందమూరి బాలకృష్ణకు టబు .. లవర్‌గా, భార్యగా, తల్లిగా నటించిన ఘనతను దక్కించుకున్నారు. 2002లో వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో పెద్ద బాలయ్యకి భార్యగా, చిన్న బాలకృష్ణకు తల్లిగా నటించారు. ఇక 2008లో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పాండురంగడు సినిమాలో బాలకృష్ణకు ప్రియురాలిగా నటించి మెప్పించారు. కాగా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి మూవీలో టబు ఓ కీలకపాత్ర చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అలాగే హిందీలో బూత్ బంగ్లా సినిమాలో టబు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











