మీరు చాలా హాట్ గురూ.. అలా ఎలా ఉంటారు? లెజెండరీ యాక్టర్‌పై త్రిష కామెంట్
దక్షిణాది సినిమా పరిశ్రమకు సంబంధించిన సైమా 2025 (2025) అవార్డుల వేడుక దుబాయ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో ఎన్నో విశేషాలు, విషయాలు చోటు చేసుకొన్నాయి. ఈ అవార్డుల కార్యక్రమంలో అందాల భామ త్రిషా కృష్ణన్ చేసిన కామెంట్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. త్రిషా కామెంట్స్ వివరాల్లోకి వెళితే..
దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో త్రిషా కృష్టన్ అందంగా ముస్తాబయ్యారు. 4 పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా గ్లామర్‌తో ఆకట్టుకొన్నారు. అంతేకాకుండా తన మాటలతో ఆమె అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. విలక్షణ నటుడు, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్, పొగడ్తలు మీడియా హెడ్‌లైన్లుగా మారాయి.
అవార్డుల వేడుకలో త్రిషా మాట్లాడుతూ.. కమల్ సార్.. మీరు ఇలా హ్యాండ్సమ్‌గా ఎలా ఉంటారు. ఇంత హాట్‌గా ఎలా మెయింటెన్ చేస్తుంటారు. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే? ఇంత ఫిట్‌గా హాట్‌గా ఎలా ఉంటారు. ఇది నాకు వచ్చే ఆలోచనే కాదు. అందరూ నన్ను అడుగుతుంటారు. ప్రతీ ఒక్కరు మీ పర్సనాలిటీ హుందా తనాన్ని గురించి నాతో ప్రస్తావిస్తు ఉంటారు. మీకు మీరే సాటి అంటూ ఏకధాటిగా స్టేజీ మీద నుంచి మాట్లాడుతూ.. నవ్వుల పూలు పూయించారు.

త్రిషా మాటలకు కమల్ కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. ఆమె మాటలు నవ్వుల్లో మునిగిపోయాడు. గట్టిగా పగలబడి నవ్వుతూ ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్ పెట్టారు. ఆయనతో ఉన్న శివకార్తీకేయన్‌తోపాటు తమిళ నటీనటులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు. త్రిషా స్పీచ్‌తో ఈవెంట్ మరింత వైబ్రంట్‌గా మారిపోయింది.
ఇదిలా ఉండగా, కమల్ హాసన్, త్రిషా జంటగా ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రంలో నటించారు. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే.. వారిద్దరి కెమిస్ట్రీకి అనూహ్యమైన రెస్పాన్సా్ వచ్చింది. రంగరాయ శక్తివేల్‌గా కమల్, ఇంద్రాణిగా త్రిష తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. తాజాగా ఆ వైబ్ వారిద్దరి మధ్య ఇంకా కనిపిస్తూనే ఉందని దుబాయ్ ఈవెంట్ క్లారిటీ ఇచ్చింది.

త్రిషా కెరీర్ విషయానికి వస్తే.. థగ్ లైఫ్ తర్వాత సూర్య నటిస్తున్న కరుప్పు అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తాజా స్పీచ్‌తో త్రిష ట్రెండింగ్‌గా మారింది.


Click it and Unblock the Notifications











