Don't Miss!
- News
అందుకే సీఎం జగన్ కు అంత క్రేజ్ - తండ్రిని మించి పోయేలా..!!
- Sports
INDvsNZ : మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
నడుము పట్టుకొని వెనుక నుంచి లాగి.. టీవీ నటిపై అఘాయిత్యం.. బిజినెస్ మ్యాన్ అరెస్ట్
టెలివిజన్ నటిపై అఘాయిత్యానికి పాల్పడిన బిజినెస్ మ్యాన్‌ను పోలీసు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3వ తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఫ్లయిట్‌లో ఈ సంఘటన జరిగింది. తనను శారీరకంగా వేధిస్తూ లైంగిక దాడికి పాల్పడిన గజియాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ సంఘటనపై సదరు నటి వెల్లడిస్తూ..

రాత్రి 11 గంటల ప్రాంతంలో
ఆంగ్ల జాతీయ దిన పత్రిక కథనం ప్రకారం.. తన పేరు చెప్పడానికి నిరాకరించిన నటి మీడియాతో మాట్లాడుతూ.. నా పని ముగించుకొని నేను 3వ తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్నాను. రాత్రి 11 గంటల ప్రాంతంలో ముంబైలో ఫ్లయిట్ ల్యాండ్ అయింది. ప్యాసింజర్లందరూ దిగేందుకు తమ సీట్ల వద్ద నిలుచున్నారు. నాకు చాలా వరుసలకు దూరంగా ఉన్న ఓ వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చొన్నాడు. ముందు వరుసలోని వాళ్లు దిగేందుకు ప్రయత్నిస్తుండగా నేను నిలబడి ఉన్నాను. అప్పుడు వెనుక నుంచి నా నడుము పట్టుకొని గట్టిగా వాటేసుకొన్నాడు అని టెలివిజన్ నటి చెప్పారు.

వెనుక నుంచి ఒడిలోకి లాగేసుకొని
నా వెనుక కూర్చొన్న వ్యక్తి చేసిన పనికి నేను షాక్ తిన్నాను. ఏం జరిగిందని తెలుసుకొనే లోపే తన ఒడిలోకి లాగేసుకొన్నాడు. నేను కోపంతో గట్టిగా అరిచే సరికి.. నేను అమ్మాయి అనుకోలేదు. నేను మగ ప్యాసింజర్ అనుకొన్నాను అంటూ అబద్దాలు ఆడటం ప్రారంభించారు. నేను గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత సారీ చెప్పిన తర్వాత గొడవ ఎందుకు అంటూ నాపై తిరగబడే ప్రయత్నం చేశాడు. పైగా మగవాడు అనుకొన్నానని చెప్పడం దారుణం అని టీవీ నటి ఆగ్రహం వ్యక్తం చేసింది.

సహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
తనపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి చేష్టలు భరించలేకపోయాను. వెంటనే విమాన సిబ్బందిని పిలిచాను. అయితే ఆ సమయంలో తన పేరును తప్పుగా చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఎయిర్‌లైన్స్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశాను. దాంతో వారు నన్ను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయమన్నారు. అక్టోబర్ నాలుగవ తేదీన నేను సహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. వారు దర్యాప్తు చేసి ఆ వ్యాపారవేత్తను అక్టోబర్ 14వ తేదీన అరెస్ట్ చేశారు అని టెలివిజన్ నటి తెలిపారు.

బిజినెస్ మ్యాన్ కుటుంబం క్షమాపణ
అయితే సదరు బిజినెస్ మ్యాన్ భార్య, మరో వ్యక్తి నాతో సంప్రదింపులు జరిపి కేసు వాపసు తీసుకోమని చెప్పారు. నా ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పారు. నా ఫిర్యాదును విత్‌డ్రా చేసుకోమని చెప్పాను. వాళ్లకు నా ఇంటి అడ్రస్ తెలియడంతో నాకు ఇప్పుడు భయంగా ఉంది. నా ఇంటికి వచ్చి మరోసారి దౌర్జన్యం చేస్తారేమోననే భయం కలుగుతున్నది అని టెలివిజన్ నటి ఆందోళన వ్యక్తం చేశారు.
Recommended Video

బిజినెస్ మ్యాన్‌పై కేసు నమోదు ఇలా..
.టీవీ నటి ఫిర్యాదు మేరకు బిజినెస్ మ్యాన్‌పై ముంబైలోని సహార్ పోలీసులు కేసు పెట్టారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 354, 354ఏ కింద కేసు బుక్ చేశారు. తాజా సమాచారం ప్రకారం నటి కేసు వాపసు తీసుకోలేదని తెలుస్తున్నది. సదరు నటి పలు సీరియల్స్‌లోను, సినిమాల్లోను నటించినట్టు సమాచారం. అయితే నిందితుడి ఫ్యామిలీ ఒత్తిడి మేరకు రాజీ చేసుకొనే పరిస్థితి కనిపిస్తున్నది.