twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేపిస్టుల కంటే రాజకీయ నేతలే డేంజర్.. ఆ రెండు ప్రదేశాలు చూపిస్తే? బీజేపీ నేతపై ఉర్పీ జావెద్ ఫైర్

    |

    బాలీవుడ్ నటి, హిందీ బుల్లితెర తార ఉర్ఫీ జావెద్ మరోసారి వివాదాస్పద అంశంతో మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించింది. అశ్లీల, అసభ్యత కూడిన దుస్తులు ధరించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచిన ఉర్పీపై నెటిజన్లు, సెలబ్రిటీలు భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ట్రోలింగ్‌తో లాభం లేదనుకొన్న కొందరు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కేసుల్ని ఫైల్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ నేత చిత్రా వాఘ్ ఫిర్యాదుపై ఉర్పీ జావెద్ స్పందిస్తూ....

     కొత్త సంవత్సరంలో ఉర్పీపై కేసు

    కొత్త సంవత్సరంలో ఉర్పీపై కేసు

    బుల్లితెర నటి ఉర్ఫీ జావెద్ ఇటీవల దుబాయ్‌లో పర్యటించిన సమయంలో ఆమె అశ్లీల దుస్తులతో కనిపించడంపై అక్కడి పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఆమె వ్యవహార తీరుపై దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా తన తీరు మార్చుకోకుండా అర్ధనగ్నంగా తన అందాలను ప్రదర్శిస్తున్నారు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా ఉర్ఫీ జావెద్‌పై బీజేపీ నేత చిత్ర వాఘ్ కేసు నమోదు చేశారు.

    నేను జైలుకు వెళ్లడానికి రెడీ..

    నేను జైలుకు వెళ్లడానికి రెడీ..

    అశ్లీల దుస్తులను ధరిస్తూ.. బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న నేపథ్యంలో ఆమెను కట్టడి చేయాలని, అలాగే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చిత్రా వాఘ్ కేసు నమోదు చేశారు. అయితే చిత్రా వేసిన కేసు గురించి స్పందిస్తూ.. విచారణ, దర్యాప్తు అంతా బుల్ షిట్. నీవు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఆస్తులను బహిరంగంగా పరిస్తే.. నేను జైలుకు వెళ్లడానికి రెడీ.

    రాజకీయ నేతలు భారీగా ఎక్కడ నుంచి సంపాదిస్తున్నారో.. భారీగా ఆస్తులు కూడబెట్టుకొంటున్నారో చెప్పాలి. మీరు నిర్వహించే పార్టీల్లో మహిళలను మీకు కుటుంబానికి చెందిన పురుషులు వేధిస్తారంటగా? వారి గురించి ఫిర్యాదు చేస్తారా? అని ఉర్పీ జావెద్ ప్రశ్నించింది.

    రాజకీయ నేతలు అసలు పనిలేదా?

    రాజకీయ నేతలు అసలు పనిలేదా?

    ఉర్ఫీ జావెద్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వరుసగా పోస్టులు పెడుతూ.. కొత్త సంవత్సరం పోలీసులు కేసులతో మొదలుపెట్టాను. మరో రాజకీయ నేత నాపై కేసు నమోదు చేసింది. రాజకీయ నేతలకు పనిలేదా? అసలు రాజకీయ నేతలేనా? వారి న్యాయవాదులకు కొంతైనా స్పృహ ఉందా? వారికి రాజ్యాంగం గురించి అసులు తెలుసా? ఎలాంటి విషయం తెలియకుండా వారు నాపై కేసులు ఎలా నమోదు చేస్తారు అని ఉర్ఫీ జావెద్ ప్రశ్నించింది.

    ఎద, మర్మాంగం చూపిస్తే..

    ఎద, మర్మాంగం చూపిస్తే..

    భారత రాజ్యాంగంలోని నిబంధనలను గురించి వెల్లడిస్తూ.. ఎవరైనా మహిళ తన స్థనాలను పూర్తిగా బహిరంగ పరిచినా.. లేదా మర్మాంగం చూపిస్తే అది తప్పు కిందకు వస్తుంది. ఒకవేళ నేను అలా నా ఎదభాగం (నిప్పుల్స్) లేదా మర్మాంగం (వెజినా) చూపిస్తే తప్ప నన్ను జైలుకు పంపించలేరు. నాపై కేసులు వేసి మీడియాలో పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు అని ఉర్పీ జావెద్ చెప్పింది.

    ముంబైలో అమ్మాయిల అక్రమ రవాణా

    ముంబైలో అమ్మాయిల అక్రమ రవాణా

    నా వస్త్రాలంకరణ, దుస్తుల ధరించడాన్ని టార్గెట్ చేయకుండా.. ముంబైలో యువతులపై జరుగుతున్న అక్రమాల గురించి దృష్టి పెట్టండి. ముంబైలో అమ్మాయిల అక్రమ రవాణా, బలవంతంగా యువతులను వేశ్యవృత్తిలోకి పంపుతున్నారు. అక్రమంగా డ్యాన్స్ బార్ల నిర్వహణ, వేశ్యగృహాలను నిర్వహించడం మాటేమిటి అని ఉర్పీ జావెద్ ఘాటుగా స్పందించింది.

    బానో రేప్ హంతకులు స్వేచ్ఛగా

    బానో రేప్ హంతకులు స్వేచ్ఛగా

    ముంబైలోను, సమాజంలోను బిల్కీ బానో రేప్ హంతకులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. బానోనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా దారుణంగా చంపేశారు. కానీని వారిని అరెస్ట్ చేయమని నాపై కేసులు నమోదు చేసేవారు పోలీసులకు ఫిర్యాదు చేయరు. కానీ నాలాంటి వారిని అరెస్ట్ చేయాలని రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సమాజానికి రేపిస్టుల కంటే ఇలాంటి రాజకీయ నేతల నుంచే భారీ ముప్పు ఉంది అని ఉర్పీ జావెద్ సెటైర్ వేసింది.

    English summary
    Actress Urfi Javed satires on BJP Leader Chitra Wagh over filing case against her on New year. She posted that Unless my n*pples and v*gina are seen, you can’t send me to jail. These people are only doing this for media attention.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X