Don't Miss!
- News
ఎందుకు రాలేదు? పిలిస్తేగా వచ్చేది?: కేటీఆర్, ఈటల మధ్య మాటలు, రాజాసింగ్ డ్రెస్సుపై.!
- Lifestyle
మీ తలలో మొటిమలు ఉన్నాయా?మొటిమలు దురుదపెడుతున్నాయా? వాటికి కారణాలు, నివారణ ఇక్కడ తెలుసుకోండి!
- Finance
Vidya Deevena: విద్యార్థుల ఆశలకు 'విద్యా దీవెన' రెక్కలు.. నిధులు విడుదల చేసిన సీఎం..
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya: మీరు నా ఫేవరెట్ హీరో, కానీ అదొక్కటే లోటు.. ఊర్వశీ రౌటేలా కామెంట్స్!
స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి. అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ బాస్ గా మారాడు. ఖైదీ నెం 786 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే ఆచార్యతో ప్లాప్ అందుకున్న చిరు ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి వాల్తేరు వీరయ్యగా మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. సినిమాతో అభిమానులను, టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ముందుకు వస్తున్నాడు. అయితే తాజాగా నిర్వహించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా స్పీచ్ లోకి వెళితే..

అదిరిపోయిన టీజర్, ట్రైలర్..
మెగా స్టార్ చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ సుమారు 22 ఏళ్ల తర్వాత కలిసి నటించిన తాజా మల్టీ స్టారర్ చిత్రం వాల్తేరు వీరయ్య. యాక్షన్ మాస్ మసాల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపిస్తే ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీలర్ గా చిరు అలరించనున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ అదిరిపోయాయి.

ట్రెండింగ్ లో దూసుకుపోయిన పాట..
వాల్తేరు వీరయ్య సినిమా నుంచి విడుదలైన తొలి పాట బాసు పార్టీ. ఈ పాటలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటేలా అదిరిపోయే స్టెప్పులేసింది. చిరంజీవితోపాటు ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ఆకట్టుకుంది. దీంతో ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోయింది. ఇప్పటికీ అనేక షోలలో, ప్రోగ్రామ్స్ లో ఈ సాంగ్ ఊపేస్తోంది. ఈ సినిమాలో ఊర్వశితోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్లు శ్రుతి హాసన్, కేథరిన్ ట్రేసా కూడా నటించిన విషయం తెలిసిందే.

సందడి చేసిన ముద్దుగుమ్మలు..
ఇదిలా ఉంటే టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన చిత్రమే వాల్తేరు వీరయ్య. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కాగా తాజాగా జనవరి 8న అంటే ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిరు, రవితేజ, బాబీ, నిర్మాతలు, రైటర్స్, దేవీ శ్రీ ప్రసాద్ తోపాటు ఊర్వశీ రౌటేలా, కేథరీన్ ట్రేసా హాజరై సందడి చేశారు.

ఇది రెండో సారి..
వైజాగ్
లోని
ఏయూ
ఇంజినీరింగ్
కాలేజ్
మైదానంలో
అట్టహాసంగా
జరిగిన
వాల్తేరు
వీరయ్యప్రీ
రిలీజ్
ఈవెంట్
లో
బాలీవుడ్
ముద్దుగుమ్మ
తన
క్యూట్
స్పీచ్
తో
ఆకట్టుకుంది.
అందరికీ
నమస్కారం.
"నిజంగా
నాకు
ఎక్కడి
నుంచి
మొదలు
పెట్టాలో
తెలియడం
లేదు.
చాలా
సంతోషంగా
ఉంది.
వైజాగ్
కి
నేను
రావడం
ఇది
రెండోసారి.
చాలా
అందమైన
ప్రదేశం.
సముద్రంతో
ఎంతో
ఆహ్లాదకరంగా
ఉంటుంది"
అని
ఊర్వశీ
రౌటేలా
తెలిపింది.

మీకు అది బాగా తెలుసు..
"డైరెక్టర్ గారు మీరు చాలా టాలెంటెడ్. ఆయనకు ఏం కావాలో బాగా తెలిసిన డైరెక్టర్. చాలా అంకితభావం ఉన్న వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. మీ గురించి చెప్పాలంటే ఒక వ్యాసం రాయాలి. నటీనటులను మీకంటే బాగా ఎవరు చూపించగలరు. మీకు ఒక ఆర్టిస్టును ఎలా చూపించాలో బాగా తెలుసు. నేను ఒక పదంలో అది చెప్పలేను. మీతో వర్క్ చేయడం చాలా బాగుంది. తర్వాతి సినిమాలోనైనా పూర్తి నటిగా చేస్తానని భావిస్తున్నాను" అని ఊర్వశీ పేర్కొంది.

ఆ అవకాశం కుదర్లేదు..
"దేవి శ్రీ ప్రసాద్ గారు మీరు ఒక రాక్ స్టార్. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా. మీరు ఒక బ్లాక్ బస్టర్ మేషిన్ అని ఇండియాలో ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. మైత్రీ మూవీ మేకర్స్ వారికి చాలా కృతజ్ఞతలు. రవితేజ గారు నా మోస్ట్ ఫేవరెట్ నటుల్లో మీరు ఒకరు. మీతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కుదర్లేదు. అదొక్కటే నేను బాధపడే విషయం. కానీ భవిష్యత్తులో మీతో నటిస్తానని అనుకుంటున్నాను" అని ఊర్వశీ చెప్పింది.

చాలా గర్వంగా ఉంది..
"నేను ఎంతోమంది సూపర్ స్టార్స్ తో నటించాను కానీ చిరంజీవి గారు మీరు చాలా ప్రత్యేకం. మీతో అంటే మెగాస్టార్ చిరంజీవితో నటించడం ఇది నా అదృష్టం. గర్వంగా భావిస్తున్నాను. సూపర్ స్టార్ కి మెగాస్టార్ కి మధ్య తేడా ఏంటో మీతో పనిచేశాకే అర్థమైంది. చిరంజీవి అంటే అమరుడు. మీరు మీ అభిమానుల్లో చిరస్థాయిగా చిరంజీవులుగా (అమరులై) ఉంటారు" అని బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటేలా పేర్కొంది.