twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోవిడ్ బాధితులకు అండగా ఊర్వశి రటేలా.. నిత్యావసర వస్తువుల పంపిణితో మానవత్వం

    |

    బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లో సత్తా చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్న ఊర్వశి రటేలా సమాజ సేవకు పూనుకొన్నారు. కరోనా సమయంలో తిండి కోసం కష్టాలు పడుతున్న పేదలకు నిత్యావసర వస్తువులను పంచారు. ఉత్తరాఖండ్‌లోని కోటద్వార్ ప్రాంతంలో తన తండ్రి మాన్వర్ సింగ్ రౌటేలాతో రేషన్‌ పంపిణి చేపట్టారు. తాను నటించిన వెర్సేస్ బేబి సాంగ్‌కు వచ్చిన పారితోషికాన్ని కూడా కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. తాను స్థాపించిన ఊర్వశి రటేలా ఫౌండేషన్ ద్వారా ఈ సేవలను ప్రారంభించింది.

    బ్రా లేకుండా షర్ట్ బటన్స్ విప్పేసి.. షాక్ ఇచ్చిన కావ్య తప్పర్

    ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన ఊర్వశి తన ప్రాంతంలో రోజువారీ కూలీలు పడుతున్న బాధల్ని తెలుసుకొని తన తండ్రి ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణి చేపట్టారు. పేదలకు సహాయం అందించేందుకు యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు అందిస్తానని. కోవిడ్19 రిలీఫ్ ఫండ్, ఇతర విపత్తులు సంభవిస్తే వాటికి సహాయం అందిస్తాను ఆమె తెలిపారు.

     Urvashi Rautela distributed ration Kotdwar, Uttarakhand

    ముంబైలోని తౌక్తే తుఫాన్ బాధితులకు ఆహార ప్యాకెట్లు, మాస్కులను అందిస్తూ పేదలకు అండగా నిలిచారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో కరోనావైరస్ బాధితులకు ఇప్పటికే 27 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్‌ను అందించారు. వీలైనంత వరకు తన శాయశక్తుల సేవ చేయడానికి ప్రయత్నిస్తాను అని ఊర్వశి చెప్పారు.

     Urvashi Rautela distributed ration Kotdwar, Uttarakhand

    ఊర్వశి రటేలా కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటికే బ్లాక్ రోజ్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా ద్వారా తమిళంలోకి అడుగుపెడుతున్నారు. తిరుతు పాయలే 2 హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. అలాగే సూపర్ కాప్ అవినాష్ మిశ్రా జీవితం ఆధారంగా రూపొందుతున్న ఇన్స్‌పెక్టర్ అవినాష్ వెబ్ సిరీస్‌లో కూడా మంచి పాత్రను పోషిస్తున్నారు.

    English summary
    Urvashi Rautela has initiated an organization for the well being of society and is the proud owner and founder of her organization which goes by the name “Urvashi Rautela Foundation”, which helps the people in need. Recently Urvashi Rautela’s father Manavar Singh Rautela distributed ration to the daily wage labourers in a small town called Kotdwar in Uttrakhand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X