For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో కూతురినైనా క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్పలేదు.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్

  |

  వరలక్ష్మి శరత్ కుమార్ పేరు మొన్నటి వరకు తమిళ్ లో మాత్రమే వినిపించేది. కానీ క్రాక్ తరువాత ఆమెకు ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ పెద్ద కూతురైన ఈ టాలెంటెడ్ నటీమణి మెల్లమల్లగా తన టాలెంట్ తో క్రేజ్ ను పెంచుకుంటోంది. నేడు వరలక్ష్మి శరత్ కుమార్ 36వ పుట్టినరోజు. సోషల్ మీడియాలో జయమ్మకు భారీ స్థాయిలో విషెస్ అందుతున్నాయి. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను దాటుకుంటూ వచ్చినట్లు చెప్పింది.

  Varalaxmi Sarath Kumar హవా మొదలైంది ! ఐరన్ లేడీ పాత్రకి కేర్ ఆఫ్ అడ్రస్
  స్టార్ హీరో వారసురలిగా..

  స్టార్ హీరో వారసురలిగా..

  శరత్ కుమార్ అంటే సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి మార్కెట్ ఉన్న హీరో అని అందరికి తెలిసిన విషయమే. ఇక ఆయన మొదటి భార్య ఛాయా కూతురే వరలక్ష్మి. ఈమెకు ఒక చెల్లెలు, తమ్ముడు కూడా ఉన్నారు. శరత్ కుమార్ సినీ వారసురలిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినప్పటికి సపోర్టింగ్ రోల్స్ తో మాత్రం సినిమాలపై అంచనాలు పెంచేస్తోంది.

  16 ఏళ్ల వయసులోనే

  16 ఏళ్ల వయసులోనే

  ఇటీవల తెలుగులో ఆమె చేసిన క్రాక్, నాంది సినిమాలు ఏ రేంజ్ హిట్టయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ ఊపుతోనే మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అసలైతే మొదట వరలక్ష్మికి 16 ఏళ్ల వయసులోనే అవకాశాలు చాలా వచ్చాయి. ముఖ్యంగా శంకర్ బాయ్స్ సినిమాలో జెనీలియా కంటే ముందు హీరోయిన్ గా అనుకున్నారాట.

  ప్రేమిస్తే సినిమాలో కూడా..

  ప్రేమిస్తే సినిమాలో కూడా..

  శంకర్ నిర్మాతగా తెరకెక్కిన ప్రేమిస్తే సినిమాలో కూడా అవకాశం వచ్చిందట. కానీ అప్పుడు ఎడ్యుకేషన్ కారణంగా సినిమాలకు చాలా దూరంగానే ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. ఇక 2012లో శింబు పోడా పొడి సినిమా ద్వారా వరలక్ష్మి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.

  ఆ మూవీతో భారీ క్రేజ్

  ఆ మూవీతో భారీ క్రేజ్

  అయితే వరలక్ష్మి హీరోయిన్ గా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. ఇక ఎప్పుడైతే ఆమె విజయ్ సర్కార్ సినిమాలో నెగిటివ్ రోల్ చేసిందో అప్పటి నుంచి డిమాండ్ మరింత పెరిగింది. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో తన నటనతో విజయ్ కు పోటీని ఇచ్చింది. పవర్ఫుల్ ఐరెన్ లేడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.

  క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు

  క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు

  అయితే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారికి ఇండస్ట్రీలో పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవు అనే కామెంట్స్ చాలానే వస్తుంటాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉండవని అంటుంటారు. అయితే వరలక్ష్మికి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయట. ఏ మాత్రం భయపడకుండా వారిని ఒంటరిగానే ఎదుర్కొని నిలదొక్కుకున్నట్లు చెప్పింది.

  అలా 29 సినిమాలు చేశాను

  అలా 29 సినిమాలు చేశాను

  అయితే ఇప్పటి వరకు తాను బ్యాపిగానే 29 సినిమాల్లో నటించానని చెబుతూ.. ఆ సినిమాలకు పని చేసినవాళ్ళందరూ కూడా చాలా మాంచి వారని తెలిపారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు మాత్రం వాటిను రిజెక్ట్ చేసి వాళ్లకు కౌంటర్ కూడా ఇచ్చినట్లు వరలక్ష్మి వివరణ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో పవర్ఫుల్ లేడి పాత్రల కోసం నటిగా వరలక్ష్మి అయితే బెటర్ అని దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెంటపడుతున్నారు. త్వరలోనే ఆమె అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న పొలిటికల్ సినిమాలో ఒక రాజకీయ నాయకురాలిగా కనిపించబోతున్నట్లు టాక్.

  English summary
  Varalaxmi Sarathkumar is a name that is heard more in Telugu now than in Tamil. The talented actress, the eldest daughter of Kollywood senior star hero Sarath Kumar, is slowly raising her status. Needless to say, her recent Telugu films Crack and Nandi have been a hit in any range. That momentum is giving the green signal to more movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X