మళ్లీ దొరికిపోయిన రష్మిక .. ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ అలా..
Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా.. ఈ స్టార్ కపుల్ గురించి సినీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట గీత గోవిందం (2018) సినిమాలో మొదటిసారి కలిసి పనిచేశారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ (2019) లో వీరి కెమిస్ట్రీ మరింత దగ్గరైంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ పుకార్లు మొదలయ్యాయి. ఇప్పుడు అయితే ఆ పుకార్లు నిజమవుతున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సెలబ్రెటీ కపుల్ రహస్యంగా నిశ్చితర్థం చేసుకున్నట్టు సోషల్ మీడియా కథనాలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, మొన్న విజయ్ దేవరకొండ ఓ హింట్ ఇవ్వగా.. నేడు నేషనల్ క్రష్ మరో హింట్ ఇచ్చింది. దీంతో వీరికి నిజంగానే నిశ్చితార్థం అయిందా? అనే సందేహాం మొదలైంది. ఇంతకీ విషయమేంటీ?
కన్నడ క్యూటీ నుంచి నేషనల్ క్రష్‌గా ఎదిగిన రష్మిక మందన్నాపేరు ఇప్పుడు దేశం అంతా మార్మోగుతోంది. ఆమె అందం, అభినయం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దూసుకుపోతోంది. పుష్పలో 'శ్రీవల్లి'గా నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయారు. యానిమల్, పుష్ప 2 సినిమాలు రష్మిక కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా మారాయి. అల్లు అర్జున్ సరసన పుష్ప 2: ది రూల్ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఈ మూవీలో రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్‌లో నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

అనంతరం 'ఛావా'సినిమా భారీ హిట్ అందుకుంది. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక.. బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు అందుకుంటూ బిజీగా మారారు. ఇక రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో 'థామా'సినిమాతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోడానికి సిద్ధమవుతోంది. అలాగే.. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా కలిసి 'VD14'అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లికి ముందే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఇద్దరూ కలిసి పని చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.
దక్షిణం నుంచి ఉత్తరం వరకూ అభిమానులను అలరిస్తూ రష్మిక మందన్నా గత రెండు వారాలుగా తరుచు వార్తల్లో నిలుస్తోంది. హీరో విజయ్‌తో రష్మిక మందన్న నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారని ఇండస్ట్రీ టాక్. అలాగే.. ఈ జంట మీడియా కంటబడిన సందర్భాలెన్నో. ఈ క్రమంలో ఎన్ని సార్లు రూమార్స్ వచ్చిన వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. తాము మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కలరింగ్ ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిందనీ, వచ్చే ఏడాది వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రష్మిక ఇన్‌స్టా రీల్‌లో మెరిసిన డైమండ్ రింగ్
ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరేలా ఈ జంట వ్యవహరిస్తున్నారు. తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెంపుడు కుక్కతో సరదాగా గడిపిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో నేషనల్ క్రష్ కంఫర్ట్ లుక్‌లో కనిపించింది. తన పెంపుడు కుక్కను పంపారింగ్ చేస్తుంది. అయితే.. అభిమానుల కళ్లంతా ఆమె ఎడమ చేతి ఉంగరంపై పడ్డాయి. భారీ డైమండ్‌తో మెరిసే ఆ రింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు "ఇదే ఆ ఎంగేజ్‌మెంట్ రింగ్ కావచ్చు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. పైగా రష్మిక తన ఇన్‌స్టా రీల్‌కు "ఈ సినిమాలో మొదట విన్న పాట ఇదే, ఈ లవ్ చాలా స్పెషల్ "అనే క్యాప్షన్ రాసింది. ఆ పాట ఆమె రాబోయే బాలీవుడ్ మూవీ "థామా" లోనిది. 'రష్మిక లవ్ మూడ్ లో ఉంది. ఆ పాట విజయ్ కోసమేనా'అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరి నిశ్చితార్థం జరిగిందని అనధికారికంగా వార్తలు వస్తున్ననేపథ్యంలో, రష్మిక షేర్ చేస్తున్న రీల్‌లో ఆ రింగ్ కనపడడం అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు అయ్యింది.
విజయ్ చేతిలో కూడా అదే రింగ్!
అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ కుటుంబ సమేతంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సందర్శనలో విజయ్ చేతిలో కూడా ఒక రింగ్ కనిపించింది. ఆ రింగ్ రష్మిక పెట్టుకున్న రింగ్ చాలా దగ్గరగా ఉండటంతో నెటిజన్లు 'ఇద్దరి లవ్ సింబల్ ఇదేనేమో!'అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొన్న విజయ్.. నేడు రష్మిక లు తమ రింగ్స్ చూపించి.. ఎంగేజ్మేంట్ అయినట్టు పరోక్షంగా హింట్ ఇస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ జంటకు కాంగ్రాట్స్ చెబుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











