twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Myositis సమంతకు అరుదైన వ్యాధి.. డిసీజ్‌‌కు కారణం.. చికిత్స ఏమిటి?

    |

    దక్షిణాదిలో అగ్రతార సమంత రుత్ ప్రభు ఆరోగ్యంపై పలు రోజులుగా మీడియాలో అనేక కథనాలు హోరెత్తుతున్నాయి. అయితే తనకు ఎదురైన ఆరోగ్య సమస్యపై అనేకంగా వార్తలు వస్తున్నప్పటికీ.. మౌనంగానే ఉన్నారు. అయితే తాను నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైన సమయంలో సమంత తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా తాను ఇబ్బందిపడుతున్న వ్యాధి గురించి వెల్లడించి.. అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. సమంత బాధపడుతున్న వ్యాధి.. దాని వల్ల ఎదురయ్యే ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    సమంత ఆరోగ్యంపై రూమర్లు..

    సమంత ఆరోగ్యంపై రూమర్లు..


    గత నెలల రోజులుగా సమంత సోషల్ మీడియాలో కనిపించకుండా పోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దాంతో అనేక రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె చర్మ వ్యాధితో బాధపడుతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే సమంత, ఆమెకు సంబంధించిన పీఆర్ వర్గాలు కూడా మౌనంగానే ఉన్నారు.

    యశోద ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్

    యశోద ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్


    ఇక యశోద ప్రమోషన్స్ ముందుగా సమంత తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చింది. యశోద సినిమా ట్రైలర్‌పై మీరు కురిపించిన ప్రేమ, రెస్పాన్స్ మాకు చాలా ఉత్సాహాన్ని అందించింది. ఈ ఆనంద సమయంలో నేను ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సవాల్‌ను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మయోసిటిస్ అనే కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాను అని తన ట్వీట్‌లో వెల్లడించింది.

    నాకు మయోటిస్ వ్యాధి అంటూ సమంత

    నాకు మయోటిస్ వ్యాధి అంటూ సమంత


    మయోసిటిస్ అనే వ్యాధికి లోనయ్యానని తెలిసినప్పుడు.. త్వరలోనే తగ్గిపోతుందనే భరోసాలో ఉన్నాను. కానీ ఆ వ్యాధి నన్ను సుదీర్ఘంగా వెంటాడుతుండటంతో మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. త్వరలోనే నేను ఈ వ్యాధి నుంచి బయటపడుతానని డాక్టర్లు చెప్పారు. నా జీవితంలో మంచి రోజులు ఉన్నాయి.. చెడు రోజులు ఉన్నాయి. కానీ కొద్ది రోజులుగా మానసికంగా, శారీరకంగా నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను అని పోస్టులో తెలిపింది.

    మయోసిటీస్ వ్యాధి కారణాలు ఏమిటి?

    మయోసిటీస్ వ్యాధి కారణాలు ఏమిటి?


    మయోసిటిస్ వ్యాధి లక్షణాలు ఏమిటంటే? కండరాల్లో విపరీతమైన నొప్పిని కలిగించే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి గురైనప్పుడు చర్మం వాచిపోవడం జరుగుతుంది. కండరాలు, శరీరంలోని ఇతర అవయవాలు బలహీనమైపోతాయి. వేగంగా బరువు కోల్పోవడం, విపరీతమైన అలసట, జ్వరంతో బాధపడటం జరుగుతుంది అని వైద్యులు వెల్లడించారు.

    మయోసిటీస్ ట్రీట్‌మెంట్ ఏమిటి?

    మయోసిటీస్ ట్రీట్‌మెంట్ ఏమిటి?

    మయోసిటీస్ వ్యాధికి కారణం.. గాయాలకు గురికావడం, రకరకాల మెడిసిన్స్ వాడటం, వైరల్ ఇన్‌ఫెక్షన్, జలుబు, కోవిడ్ లాంటి వైరస్ ఇలాంటి వ్యాధికి కారణమవుతాయి. అలాగే ఈ వ్యాధికి గురికావడం వల్ల వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుంది. దాంతో శరీరంలో జరిగే మార్పులు దేహం తట్టుకోలేకపోతుంది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. ఈ వ్యాధి నివారణ కోసం గ్లూకోకోర్టికోయిడ్స్ అనే చికిత్స చేయాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో వ్యాధి నుంచి త్వరగా బయటపడటానికి సులభం అవుతుంది.

    యశోద ప్రమోషన్స్‌కు దూరం

    యశోద ప్రమోషన్స్‌కు దూరం


    ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల సమంత తాను నటించిన యశోద సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. యశోద సినిమా ప్రోమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే యశోద ట్రైలర్‌కు మంచి రెస్పాన్ లభిస్తున్నది.

    English summary
    Actor Samantha Ruth Prabhu has revealed she had been diagnosed with an auto-immune condition called Myositis. She said the doctors have expressed confidence that she would make a full recovery. She said the disease remission, however, is taking longer than expected.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X