For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha Ruth Prabhu మిస్టరీగా మారిన సమంత వ్యవహారం.. ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు డిలీట్ చేసి..

  |

  తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ కపుల్ సమంత రుత్ ప్రభు, నాగచైతన్య అక్కినేని విడిపోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఇద్దరు నాలుగేళ్లు గడవక ముందే తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు చైతూ, సమంత సంయుక్తంగా ప్రకటన చేశారు. ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి అధికారికంగా విడిపోతున్నట్టు ప్రకటించడం అభిమానులకు షాక్ గురి చేసింది. అయితే ఆ ఇన్స్‌టాగ్రామ్ పోస్టు విషయం ఇప్పుడు మరో మిస్టరీకి దారి తీసింది. ఆ వివరాల్లోకి వెళితే..

   నాగచైతన్యతో సమంత రిలేషన్

  నాగచైతన్యతో సమంత రిలేషన్

  సమంత, నాగచైతన్య ఇద్దరి పరిచయం 2010లో ఏ మాయ చేశావే సినిమా షూటింగ్‌లో జరిగింది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వారిద్దరూ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా హిందూ, క్రిస్టియన్ మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నట్టు కనిపించారు.

  అక్టోబర్ 2వ తేదీన సమంత ప్రకటన

  అక్టోబర్ 2వ తేదీన సమంత ప్రకటన


  అయితే సమంత కెరీర్ పట్ల కొంత దూకుడుగా ఉండటంతో అక్కినేని ఫ్యామిలీ నుంచి అభ్యంతరం వ్యక్తమయ్యాయి. కానీ వారి మాటలను పెడచెవిన పెట్టడంతో చైతూతో వైవాహిక జీవితంలో అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అప్పటి నుంచి వారిద్దరూ విడిపోతున్నారనే విషయం మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. దాంతో 2022, అక్టోబర్ 2వ తేదీన నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించారు.

  ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి సమంత అలా.

  ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి సమంత అలా.


  నాగచైతన్య, సమంత తాము దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటిస్తూ.. నా శ్రేయోభిలాషులందరికి విన్నపం. రకరకాల చర్చలు, ఆలోచనల తర్వాత భార్యభర్తల బంధానికి నాగచైతన్య ముగింపు పలుకుతున్నాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకొన్నాం. మా మధ్య దశాబ్దకాలంగా స్నేహం ఉంది. అంతకంటే మంచి రిలేషన్‌షిప్ ఉంది. అప్పటి మాదిరిగానే మేము మా బంధాన్ని కొనసాగిస్తాం. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మాకు ఫ్యాన్స్, స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం కావాలి. మా ప్రైవసీకి ఎలాంటి భంగం కలిగించవద్దు అని వేడుకొంటున్నాం అని సమంత పోస్ట్ చేసింది.

   విడాకుల ప్రకటనను డిలీట్ చేసిన సమంత

  విడాకుల ప్రకటనను డిలీట్ చేసిన సమంత

  అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రుత్ ప్రభు ఇన్స్‌టాగ్రామ్ నుంచి రకరకాల పోస్టులను డిలీట్ చేశారు. నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను, ఆయనతో ఫోటోల రూపంలో ఉన్న అనుభూతులను తన అకౌంట్ నుంచి తొలగించింది. అలా తమ మధ్య ఉన్న గుర్తులను చెరిపేసేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే తాజాగా విడిపోతున్నట్టు పెట్టిన పోస్టును కూడా ఇటీవల డిలీట్ చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

  నాగచైతన్య తన పోస్టు అలానే ఉంచుతూ..

  నాగచైతన్య తన పోస్టు అలానే ఉంచుతూ..

  అయితే సమంతతో విడిపోతున్నట్టు చేసిన పోస్టు నాగచైతన్య ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో అలానే ఉంది. నాగచైతన్య తన పోస్టును అలానే పెట్టుకోగా, సమంత మాత్రం అనూహ్యంగా తొలగించింది. అయితే ఎందుకు తొలగించింది? ఆ పోస్టు తొలగించడం వెనుక మతలబు ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు అందర్ని వెంటాడుతున్నాయి. సమంత ఆ పోస్టు డిలీట్ చేయడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందా అంటూ గుసగుసలు మొదలయ్యాయి.

  Samantha - 'It's All Because Of Bunny' | Filmibeat Telugu
  యష్ రాజ్ ఫిలింస్‌తో సమంత రుత్ ప్రభు

  యష్ రాజ్ ఫిలింస్‌తో సమంత రుత్ ప్రభు

  ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత సమంత కెరీర్ రామబాణంలో దూసుకెళ్తున్నది. హిందీలో భారీ బడ్జెట్ చిత్రాలు, ప్రతిష్టాత్మకమైన బ్యానర్లలో నటించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో మూడు చిత్రాలు చేసేందుకు అంగీకరించారు అనే వార్త వైరల్ అయింది. అంతేకాకుండా శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో కాథూ వాకులా రెండు కాదల్ చిత్రం, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ శంతరుబన్ శేఖర్ రూపొందించే చిత్రంలో, ఫిలిప్ జాన్ రూపొందించే అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్ చిత్రంలో నటిస్తున్నారు.

  English summary
  Samantha Ruth Prabhu divorce with Naga Chaitanya goes viral in the media. Now, They both living separately from October 2nd. Now, Samantha deleted Instagram post about Divorce with Naga Chaitanya deleted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X