twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లైఫ్‌ ఆఫ్‌ పై' 3D... ఇఫీ ప్రారంభ చిత్రం

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్: ఆస్కార్‌ పురస్కార విజేత ఆంగ్‌ లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లైఫ్‌ ఆఫ్‌ పై'. గోవాలో నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)లో ప్రారంభ చిత్రంగా దీన్ని ప్రదర్శించబోతున్నారు. పదకొండేళ్ల కిందట యాన్‌ మార్టెల్‌ రాసిన నవల దీనికి ఆధారం. సుమారు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి ప్రపంచ నలుమూలల నుండి మంచి స్పందన వస్తోంది. నవంబరు 23న ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికంటే మూడు రోజుల ముందు ఇఫీలో ప్రదర్శితమవుతుంది.

    చిత్రం కథ ఏమిటంటే - సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక పెద్ద షిప్ మునిగిపోగా అందులో నుంచి బతికిన పై అనే 16 సంవత్సరాల యువకుడు అక్కడి నుండి ఒక చిన్న పడవలో పై తో పాటు ఒక బెంగాల్ టైగర్, ఒక కోతి, ఒక జీబ్రా మరియు ఒక హైనాలతో అతని జర్నీ ఎలా సాగింది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. పాండిచ్చేరికి చెందిన పై పటేల్‌ అనే అబ్బాయి, రిచర్డ్‌ పార్కర్‌ అనే పులితో కలిసి దాదాపు 227 రోజులు పసిఫిక్‌ మహా సముద్రంలో ప్రయాణించాల్సి వస్తుంది. సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రం.

    ''పై పటేల్‌ సాహసయాత్రను త్రీడీలో చూపించబోతున్నాం. ప్రేక్షకులు తప్పకుండా ఉత్కంఠభరితులవుతారు'' అని ఆంగ్‌ లీ చెబుతున్నారు. ఆంగ్‌ లీ గతంలో 'క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్', 'హల్క్' మరియు 'బ్రోక్ బ్యాక్ మౌంటైన్' లాంటి ఇంగ్లీష్ చిత్రాలను తీసి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నారు. సూరజ్‌ శర్మ అనే బాలుడు పై పటేల్‌ పాత్రలో నటించారు. హిందీ తారలు ఇర్ఫాన్‌ ఖాన్‌, టబు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

    లైఫ్‌ ఆఫ్‌ పై అనే ఈ చిత్రం ప్రముఖ రచయిత యాన్‌ మార్టెల్‌ రచించిన లైఫ్‌ ఆఫ్‌ పై అనే రచన ఆధారంగా తెరెక్కుతోంది. తొలూత ఈ నవలను లండన్‌కు చెందిన ఐదు ముద్రణా సంస్థలు రిజెక్ట్‌ చేశాయి. అయితే కెనడాకు చెందిన నోఫ్‌ అనే సంస్థ ఒప్పుకుని పుస్తకాన్ని 2001లో విడుదల చేసింది.. ఈ పుస్తకానికి యాన్‌.. మేన్‌ బుకర్‌ అవార్దుతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులను సాధించాడు.

    English summary
    Oscar-award-winning director Ang Lee's much anticipated 3D film ''Life Of Pi'' will open this year's edition of International Film Festival of India (IFFI) while Mira Nair's 'The Reluctant Fundamentalist' will be the closing film. "Life Of Pi" is based on the Booker-prize-winning novel by Yann Martel. The fantasy-adventure film follows the story of a young boy, who is adrift in the Pacific Ocean for more than 200 days with a Bengal Tiger. It stars debutante Suraj Sharma, Tabu and Irrfan Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X