»   »  చీమ కూ గర్ల్ ఫ్రెండ్...అదే ఈ సారి స్పెషాలిటీ

చీమ కూ గర్ల్ ఫ్రెండ్...అదే ఈ సారి స్పెషాలిటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజల్స్ : సినిమాలో హీరో ఉంటే తప్పకుండా హీరోయిన్ ఉండాల్సిందే. అలాగే విలన్ కూడా. ఎన్ని మారినా ఇవి మాత్రం మారవు. త్వరలో రెడీ కానున్న యాంట్ మ్యాన్ సినిమా కు కూడా ఇదే స్కీమ్ ని వర్తింప చేస్తున్నారు. యాంట్‌మ్యాన్‌ తనకోసమో ప్రియురాలిని అన్వేషిస్తాడు. ఓ అందాల కందిరీగ అతని ప్రపంచాన్ని కలర్ ఫుల్ గా చేస్తుంది. ఆ కందిరీగ పేరు 'జేనెట్‌ బ్యాన్‌ డైన్‌'. తన ప్రియురాలితో కలిసి యాంట్‌మ్యాన్‌ చేసే సాహసాలు ఈ సినిమాలో స్పెషల్ గా ఉండబోతున్నాయంటున్నారు.

వాస్తవానికి...1960లలో మార్వెల్‌ కామిక్‌గా ప్రపంచానికి పరిచయం అయిన యాంట్‌మ్యాన్‌ మొదటినుంచి కొంత భయస్తుడిగానే ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే ఇప్పుడు కొంచెం సీన్‌ మారేలాగే ఉంది. 1960లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కామిక్‌ హీరోలలో స్పైడర్‌మ్యాన్‌, థోర్‌ వంటి వారంతా చాలా బలిష్టులు. మాన్లీగా ఉండటం వారి పద్ధతి. ఇలాంటి ప్రపంచంలో ఇప్పుడొక బలహీనుడు నిలబడటం కష్టమని భావించిన నిర్మాతలు, యాంట్‌మ్యాన్‌ను కొంచెం సూపర్‌హీరోగా మారుస్తున్నారు.

ఇక 'యాంట్‌ మాన్‌' సినిమా తన కలెక్షన్స్ తో అదరకొడుతోంది. తన సాహసాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ 'యాంట్‌ మాన్‌'. పీటన్‌ రీడ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో యాంట్‌ మాన్‌గా పాల్‌ రడ్‌ నటించాడు. అనేక సూపర్‌ హీరో చిత్రాలు నిర్మించిన మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మాణంలో 'యాంట్‌ మాన్‌' రూపొందింది.

‘Ant-Man’ and Wasp: Why Janet Van Dyne is so important


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇంతకీ ఈ యాంట్ మ్యాన్ కథేంటి?

ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లా ..ఈ యాంట్ మ్యాన్ వెనక కూడా ఓ కథ ఉంది. హ్యాంక్‌ అనే శాస్త్రవేత్త ఓ ప్రత్యేకమైన సూటును, హెల్మెట్‌ను సృష్టిస్తాడు. దాన్ని ధరించిన వారు సూటుకున్న బటన్‌ను నొక్కగానే మూడంగుళాలకు కుచించుకుపోతారు. ఎదుటివారికి చీమలా కనిపిస్తారు. ఆకారం తగ్గినా అత్యంత శక్తిమంతులుగా తయారవుతారు. అవసరమైనప్పుడు మళ్లీ బటన్‌ నొక్కగానే మామూలు ఆకారానికి వచ్చేస్తారు. క్రాస్‌ అనే దుర్మార్గుడు ఆ సూటును దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

అది దొరికితే తన అరాచకాలకు ఉపయోగించొచ్చనేది క్రాస్‌ కోరిక. క్రాస్‌ స్వార్థం తెలిసిన హ్యాంక్‌ దాన్ని చాలా రహస్యంగా భద్రపరచి ఉంటాడు. అయితే ఓ రోజు హ్యాంక్‌ ఇంట్లోకి చొరబడిన స్కాట్‌ అనే దొంగ ఆ సూటు ప్రత్యేకత ఏంటో తెలియకుండానే దాన్ని దొంగలిస్తాడు.

ఆ తర్వాత స్కాట్‌కు దాని ప్రత్యేకత అర్థమవుతుంది. అప్పుడు స్కాట్‌ ఏంచేశాడు? ఆ సూటు క్రాస్‌ చేతికి దొరక్కూడదన్న హ్యాంక్‌ కోరిక నెరవేరిందా? అసలు హ్యాంక్‌కు, స్కాట్‌కు ఉన్న సంబంధమేంటి? ఈ విషయాలు తెరమీద చూడాలి.

కలెక్షన్స్ మాటేంటి...

ఈ చిత్రం ఇప్పటికే అంటే ఈ నెల 17న విదేశాల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 130 మిలియన్‌ డాలర్ల (రూ.824 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం తొలి 3 రోజుల్లోనే 114 మిలియన్లు డాలర్లు వసూలు చేసింది.

కథ వెనక కథ...

అసలు ఈ కథరాయటానికి ముందు....ఓ చీమకు శక్తులు రావడం ద్వారా మనిషిగా మారే కథతో 'యాంట్‌ మాన్‌' తీయాలనుకున్నారు. కానీ మనిషే చీమగా మారేలా కథను మార్చారు. 'యాంట్‌ మాన్‌' ప్రచారాన్ని విన్నూతంగా చేశారు. టైటిల్‌కు తగ్గట్లే యాంట్‌ సైజ్‌ టీజర్‌ను రూపొందించారు. ఇందులో దృశ్యాలు అతిచిన్నవిగా కనిపిస్తాయి.

అబ్బో ఎంత కష్టం...

అనుకున్నంత ఈజీ కాదు..ఇలాంటి సినిమాలు తీయటం.... 'యాంట్‌ మాన్‌' సూట్‌ తయారీకి కాస్ట్యూమ్‌ డిజైనర్లు శామీ షెల్డన్‌, ఐవో కవనీ ఎంతో శ్రమించారు. సూటు, హెల్మెట్‌ల నమూనాలను తొలుత త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సహాయంతో రూపొందించారు. ఆ తర్వాత సూటులోని ఒక్కో విడిభాగాన్ని తయారు చేస్తూ వచ్చారు.

మొత్తం సూట్‌ తయారయ్యేసరికి ఏడునెలలు పట్టింది. అచ్చు చీమను తలపించేలా సూటుకు భుజాల దగ్గర, ఎద భాగంలో ఎరుపు రంగును వాడారు. హెల్మెట్‌లో నుంచి బయటకు చూడ్డానికి ఉన్న రంధ్రాలను చీమకళ్ల ఆకారంలో రూపొందించారు.

సినిమాలో యాంట్‌ మాన్‌ పాత్ర కోసం మొత్తం 13 సూట్లు, 17 హెల్మెట్లు, 8 జతల గ్లోవ్స్‌, 15 రకాల బెల్టులు వాడారు. సన్నివేశాలకనుగుణంగా కాస్ట్యూమ్స్‌ రూపొందిచారు. ఈ సూట్ల బరువు ఎక్కువుండటంతో పోరాట సన్నివేశాల కోసం ప్రత్యేకంగా తేలికైన సూట్లు తయారుచేశారు.

English summary
In the Marvel comics, Ant-Man and Wasp are two founding members of the Avengers. Though that isn’t necessarily the same in this film, they both have a history with SHIELD. Hank Pym — the man behind Ant-Man — created another suit for his wife Janet Van Dyne, and she became Wasp. They went on missions together for SHIELD until tragedy struck.
Please Wait while comments are loading...