»   » షాకింగ్ : నా బాడీని అద్దంలో చూసుకుంటే వాంతి వస్తుందంటున్న యాక్షన్ స్టార్

షాకింగ్ : నా బాడీని అద్దంలో చూసుకుంటే వాంతి వస్తుందంటున్న యాక్షన్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : ఆర్నాల్డ్‌ కండలు చూసే చాలా మంది హీరోలు స్ఫూర్తి పొందారు. ప్రతి జిమ్‌లోనూ యువకులకు స్ఫూర్తినిచ్చేలా ఆయన ఫొటోలు ఉంటాయి. అయితే అలాంటి కండలు ఉన్న ఆర్నాల్డ్‌కి తన శరీరాన్ని తాను అద్దంలో చూసుకుంటే వాంతి వస్తుందట.

ఆయన గుర్తురాగానే ముందు ఆయన ముఖం కన్నా ఆయన కండలు తిరిగిన శరీరం గుర్తువస్తుంది. ఎంతో మంది అభిమానులను తన ఫిజిక్ తో సొంతం చేసుకున్న ఆయన మరెవరో కాదు హాలీవుడ్ మాజీ సూపర్ స్టార్ ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగ్గర్‌.

ఆర్నాల్డ్ అనగానే ముందుగా అతని మెలితిరిగిన కండలు గుర్తొస్తాయి. హాలీవుడ్‌లో ఆయన యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తయంగా వీర డిమాండ్ ఉంది.

 తొలి మిస్టర్ ఒలింపియా

తొలి మిస్టర్ ఒలింపియా

ఆర్నాల్డ్‌ బాడీ బిల్డర్‌గానే పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. 1970లో నిర్వహించిన జోయ్‌ వీడర్స్‌ ఒలింపియా ఫిట్‌నెస్‌ అండ్‌ పర్ఫామెన్స్‌ అంతర్జాతీయ పోటీల్లో ఆర్నాల్డ్‌ విజేతగా నిలిచి తొలి మిస్టర్‌ ఒలింపియాగా మారారు.

మతిపోవాల్సిందే కానీ..

మతిపోవాల్సిందే కానీ..

ఆ తర్వాత ఏడుసార్లు వరుసగా మిస్టర్‌ ఒలింపియా పోటీల్లో గెలుపొందారు. ఆయన దేహదారుఢ్యం.. మెలితిరిగిన కండలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. కానీ ఆర్నాల్డ్‌కి తన శరీరాన్ని తాను చూసుకుంటే మాత్రం అసలు నచ్చదట.

 నాది నాకే నచ్చదు

నాది నాకే నచ్చదు


‘నన్ను నేను అద్దంలో చూసుకుంటే వాంతి వచ్చేస్తుంది. స్వతహాగా నాకు నేను ఎక్కువ విమర్శించుకుంటాను. శరీరాకృతి ప్రపంచంలో అందరికన్నా నాదే బాగున్నా.. నాకు నచ్చదు అంటున్నారు ఆర్నాల్డ్.

వెలితిగానే ఉంటుంది

వెలితిగానే ఉంటుంది

మిస్టర్‌ ఒలింపియా టైటిల్‌ గెలిచిన ప్రతీసారి నా శరీరాకృతి ఏమీ బాగుండదు.. కానీ ఎలా గెలిచానని ఆలోచిస్తా. ఎందుకంటే మనలో ఎప్పుడైనా ఎదో ఒకటి వెలితిగానే ఉంటుంది'అని ఆర్నాల్డ్ చెప్పుకొచ్చాడు.

 ఇప్పుడు కూడా అవన్నీ

ఇప్పుడు కూడా అవన్నీ


ప్రస్తుతం 69ఏళ్లు వయసున్న ఆర్నాల్డ్‌ తన వృద్ధాప్యం గురించి మాట్లాడుతూ.. ‘వయసు విషయంలో నేను బాధపడను. 20ఏళ్ల క్రితం నేను ఏ పనులు చేయగలిగానో.. ఇప్పుడు అవి చేయగలగుతున్నాను' అంటున్నాడు.

 రెమ్యునేషన్ ఎక్కువని

రెమ్యునేషన్ ఎక్కువని

నిజానికి ఆర్నాల్డ్ మన ఇండియన్ సినిమా రోబో 2 లో విలన్ గా చేస్తారని అంతా భావించారు. చర్చలు కూడా జరిగాయి. అయితే ఆయన రెమ్యునేషన్ భారీ స్దాయిలో ఉండటంతో లాస్ట్ మినిట్ లో వద్దనుకున్నారు. ఆయన ఐ సినిమా ఆడియో పంక్షన్ కు ఇండియా వచ్చారు.

English summary
Arnold Schwarzenegger has claimed he has never been happy with his body and that he suffers from a lack of confidence. Indeed the famously boastful 69-year-old insisted this problem has become even worse as he has become older, to the extent his reflection makes him want to vomit, as he is no longer able to stay in peak physical condition.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu