»   » కేక పెట్టించే అఫీషియల్ న్యూస్ :‘అవతార్‌’ సీక్వెల్ రిలీజ్ డేట్ ప్రకటన

కేక పెట్టించే అఫీషియల్ న్యూస్ :‘అవతార్‌’ సీక్వెల్ రిలీజ్ డేట్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : అవతార్ 2 విడుదల కోసం సినీ అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే . వాస్తవానికి ఈ సినిమా 2017 డిసెంబర్లోనే విడుదలవుతుందని చెప్పారు. సీక్వెల్స్ అన్నీ ఒకే సారి రెడే చేయటం వల్ల లైటే, ఈ ప్రాజెక్టును ఏడాది వెనక్కి తోశారు. దాంతో అంతా నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటన చేసి అందరినీ ఆనందంలో ముంచెత్తారు నిర్మాతలు.

అవతార్ చిత్రానికి కొనసాగింపుగా మూడు సీక్వెల్స్ చేస్తున్న ఈ టీమ్ ప్రస్తుతం 'అవతార్‌ 2' విడుదల తేదీని చిత్ర ప్రకటించింది. 21 డిసెంబరు 2018 'అవతార్‌ 2'ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 20వ సెంచరీ ఫాక్స్‌ వెల్లడించింది. అయితే ఇంకా ఓ సంవత్సరం గ్యాప్ ఉండటం మాత్రం కొద్దిగా బాధించే విషయమే.

జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ... "సీక్వెల్ చిత్రం స్టోరీ లైన్ పూర్తిగా ఒరిజనల్ లోని జాక్, జో ల కథలాగానే సాగుతుంది. అలాగే ఈ సీక్వెల్ లో వారి పిల్లలు కూడా కనపడతారు. మనష్యులతో వారికి వచ్చే సమస్యలతో ఈ ఫ్యామిలీ సాగా సాగుతుంది," అన్నారు.

Avatar Sequels Are a Family Saga Says James Cameron

ఇక అవతార్ చిత్రాన్ని జేమ్స్ కామరూన్ దాదాపు ఇరవైఏళ్లు తీశారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ఇదేం విడ్డూరం.. ఇన్నేళ్లా అనుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ, సినిమా విడుదలైన తర్వాత అద్భుతమైన సాంకేతిక మాయాజాలం అని ఒప్పుకున్నారు.

మరో, 20, 30 ఏళ్ల వరకు ఇలాంటి అద్భుతాన్ని చూడలేమని కూడా అన్నారు. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్స్ తీస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటానికి సిద్దపడుతున్నారు కామరూన్.

పండోరా గ్రహం నేపథ్యంలో తొలి భాగం సాగింది. కాగా, ఈ సీక్వెల్స్‌లో ఆ గ్రహంలో గల సముద్ర జలాల అందాలను ఆవిష్కరించాలనుకుంటున్నారట కామరూన్. నీటి లోపలి సన్నివేశాలను కనీవినీ ఎరుగని రీతిలో చిత్రీకరించాలనుకుంటున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారాయన.

సాంకేతికంగా అవతార్‌ని మించే స్థాయిలో ఈ సీక్వెల్స్ ఉంటాయని ఆయన తెలిపారు. అవతార్‌ని నిర్మించిన లైట్‌స్టామ్ ఎంటర్‌టైన్‌మెంట్, ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ సంస్థలు ఈ సీక్వెల్స్‌ని నిర్మిస్తున్నాయి.

మరో ప్రక్క 'అవతార్‌'కి నాలుగు సీక్వెల్స్‌ తీసే ప్రయత్నంలో నిర్మాతలు ఉన్నారు. మిగిలిన నాలుగు సీక్వెల్స్‌ని ఏకకాలంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అవతార్‌ 3, 4, 5లను వరసగా 2020, 2022, 2023 సంవత్సరాల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

సీక్వెల్ రిలీజ్ డేట్,నిరాశ

సీక్వెల్ రిలీజ్ డేట్,నిరాశ

దర్శకుడు కామెరెన్ ఈ చిత్రం సెకండ్ ఇనిస్టాలమెంట్ 2018 క్రిసమస్ కు వస్తుందని ప్రామిస్ చేస్తున్నారు. అంతా 2017లో ఈ చిత్రం వస్తుందని భావించారు. అయితే ఇంకా సంవత్సరం లేటు కావటం ఆయన అభిమానులను నిరాశపరిచే అంశమే. అయితే టెక్నికల్ గా ఈ సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటుందని తెలుసు కాబట్టి ,కూల్ అవ్వమంటున్నారు నిర్మాతలు

టైమ్ మిస్సైనా,టైమింగ్ మిస్ కాము

టైమ్ మిస్సైనా,టైమింగ్ మిస్ కాము

తను తీయబోయే అవతార్ సీక్వెల్స్ అన్ని క్రిసమస్ లను టార్గెట్ చేసుకునే వస్తాయని ఆయన చెప్తున్నారు. ఈ మేరకు ఆయన తను ఏర్పాట్లులలో తాను ఉన్నానని అంటున్నారు. ఫెరఫెక్ట్ ప్లానింగ్ తాము వేసుకున్నా ఒక్కోసారి సాంకేతికంగా వచ్చే సమస్యలను అధిగమించటం కష్టం కాబట్టి , కొంచెం అటూ లో తాము వస్తామని, అయితే రావటం మాత్రం పక్కా అని తేల్చేరు.

సముద్రాన్వేషి

సముద్రాన్వేషి

సముద్ర అన్వేషణ అంటే కామెరూన్‌కు ఇష్టం. సముద్రాల్లోనే అత్యంత లోతు ప్రాంతమైన మరియానా ట్రెంచ్‌కు వెళ్లొచ్చారు. అక్కడికి వెళ్లిన మూడో వ్యక్తి, ఒంటరిగా వెళ్లిన తొలి వ్యక్తి కామెరూన్. త్రీడీ ఫ్యూజన్ కెమెరా, నీటిలోపల చిత్రీకరణకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, రిమోట్ వెహికల్ టెక్నాలజీ ఆవిష్కరణల్లో పాలుపంచుకున్నారు కామెరూన్. అవతార్ సీక్వెల్ లోనూ సముద్రంలో షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు.

స్పీడుగా షూటింగ్

స్పీడుగా షూటింగ్

హాలీవుడ్‌లో 'టైటానిక్' వంటి అద్భుతమైన ప్రేమకథను తెరకెక్కించిన దర్శకుడు జేమ్స్ కామరాన్ తెరకెక్కించిన మరో అద్భుతం 'అవతార్'. ఈ సూపర్‌హిట్ సైన్స్ ఫిక్షన్‌కు త్వరలో రెండు సీక్వెల్స్‌కు సన్నాహాలు చేస్తున్నారు. 'అవతార్' సినిమాకు రెండు, మూడు భాగాల స్క్రిప్ట్‌ను తాను తయారుచేస్తున్నానని, రెండు భాగాల షూటింగ్‌ను ఒకేసారి వచ్చే ఏడాది చివరలో ప్రారంభిస్తామని దర్శకుడు జేమ్స్ కామరన్ ప్రకటించారు.

నిజమే..నాలుగు సినిమాలు వరసగా

నిజమే..నాలుగు సినిమాలు వరసగా

అంతేకాదు తన కెరీర్‌లో కేవలం అవతార్ సినిమాలు మాత్రమే తీస్తానని, అవతార్ నాలుగోభాగం కూడా తీసే అవకాశముందంటున్నాడు కామరాన్. ఫిక్షన్ కథతో రూపొందిన అవతార్ సరిగ్గా ఏడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3-డి పరిజ్ఞానంతో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.

అంతా ఆశ్చర్యమే

అంతా ఆశ్చర్యమే

పండోరా గ్రహ నేపథ్యంలో సైన్స్-ఫిక్షన్ తరహా కథతో కళ్లు చెదిరే సాంకేతిక హంగులతో అవతార్ ని అద్భుతంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు కొనసాగింపు సినిమాల్ని తీయబోతున్న కామెరాన్.. ఈ సినిమా సీక్వెల్‌లో పండోర ద్వీపంలోని సముద్ర జలాల అందాలను కూడా అద్భుతంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు.

అప్పటికంటే అద్బుతం

అప్పటికంటే అద్బుతం

తొలి అవతార్ కంటే మరిన్ని అద్భుతమైన ఎఫెక్ట్‌లతో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. అవతార్ సినిమాలో చివరి వరకు ఏయే క్యారెక్టర్స్ బతికి ఉన్నాయో అవే క్యారెక్టర్స్ తిరిగి అవతార్ సీక్వెల్స్‌లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2018 సంవత్సరంలో ఈ సీక్వెల్స్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఒకే సారి అన్ని సినిమాలు షూటింగ్ లు

ఒకే సారి అన్ని సినిమాలు షూటింగ్ లు

మొత్తానికి అవతార్ సీక్వెల్స్ రెడీ అవుతుండటంతో సినీ అభిమానులు ఆ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏకకాలంలో నిర్మాణం: సీక్వెల్ 2, 3, 4 చిత్రాలను ఏకకాలంలో రూపొందించనున్నారు. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న కామరూన్ ఈ విషయం చెప్పారు. మరికొద్ది నెలల్లోనే ఈ సీక్వెల్స్‌కి సంబంధించిన పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.

తప్పదు భరించాల్సిందే

తప్పదు భరించాల్సిందే

కొత్త సినిమా అయినా, సీక్వెల్ అయినా.. ఏదైనా ఒత్తిడికి గురి చేస్తుందని, తన కెరీర్ మొత్తం ఈ ఒత్తిడ్ని అనుభవిస్తూ వస్తున్నానని, ఇప్పుడూ అదే స్థితిలో ఉన్నానని కామరూన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సీక్వెల్స్ కోసం భారీ సెట్స్ వేయిస్తున్నామని, అలాగే, గ్రాఫిక్స్‌లో పలు కేరక్టర్లను సృష్టిస్తున్నామని చెప్పారు.

మూడేళ్లపాటు కంటిన్యూగా

మూడేళ్లపాటు కంటిన్యూగా

వరుసగా మూడేళ్ల పాటు సినీ ప్రియులకు మంచి అనుభూతినివ్వడం కోసం ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన అవతార్‌కి మూడు సీక్వెల్స్ రూపొందించనున్నారాయన. 2018లో ఒకటి, 2019లో మరొకటి, 2020లో మరో సీక్వెల్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. డిసెంబర్ నెలలోనే ఈ చిత్రాలు విడుదలవుతాయి.

న్యూజిలాండ్ లో

న్యూజిలాండ్ లో

కాగా, ఈ మూడు చిత్రాలను న్యూజిలాండ్‌లోనే తీయాలనుకుం టున్నారు. ఎందుకంటే, తొలి భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించినప్పుడు కామరూన్‌కి మంచి అనుభూతి లభించిందట. అందుకని, మూడు సీక్వెల్స్‌ని అక్కడే షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాల షూటింగ్ తమ దేశంలో జరగడం గౌరవ ప్రదంగా భావిస్తున్న న్యూజిలాండ్ ప్రభుత్వం వీలైనన్ని సౌకర్యాలు సమకూర్చాలనుకుంటోంది. అలాగే, లొకేషన్స్‌ని కూడా తక్కువ ధరకే ఇవ్వనున్నారట.

English summary
Celebrated film-maker-director-producer James Cameron, confirms that the sequel of the hit animated movie Avatar is going to be a "family saga" and probably will focus largely on the aspects of human life and struggle.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu