Just In
- 3 min ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 10 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 11 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 11 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
Don't Miss!
- News
ఉలిక్కిపడ్డ విశాఖ: మరో భారీ అగ్నిప్రమాదం: రాత్రంతా: ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా సినిమాను ముంచేశారు, మీ అభిమానులు గ్రేట్, ఓటమి ఒప్పుకున్న టాప్ డైరెక్టర్!
మార్వెల్ యూనివర్శ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'అవెంజర్స్ -ది ఎండ్ గేమ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ చిత్రంగా నెం.1 స్థానంలో ఉన్న జేమ్స్ కామెరూన్ మూవీ 'టైటానిక్'ను సైతం రెండో స్థానంలోకి తొక్కేసింది.
ఈ నేపథ్యంలో జేమ్స్ కామెరూన్ తన ఓటమిని ఒప్పుకుంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. అవెంజర్స్ లోగో టైటానిక్ షిప్పును ముంచి వేస్తున్నట్లు పిక్ షేర్ చేశారు. మార్వెల్ సంస్థకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన అభిమానులకు సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జేమ్స్ కామెరూన్ హంబుల్ రెస్పాన్స్ చూసిన మార్వెల్ ఫ్యాన్స్ అతడి సోషల్ మీడియా పోస్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు నిజాయితీగా ఓటమిని ఒప్పుకున్నారు. ఏ రంగంలో అయినా ఆరోగ్యకరమైన పోటీ అనేది అవసరం. దానికి మీరు ప్రతీకగా నిలుస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇంతకు మించి విజయాన్ని నమోదు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
— James Cameron (@JimCameron) May 9, 2019
1997లో విడుదలైన 'టైటానిక్' లైఫ్ టైమ్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా 2.1 బిలిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు దీన్ని మించిన సినిమా లేదు. ఇన్నేళ్ల తర్వాత 'అవెంజరస్-ది ఎండ్ గేమ్' ఆ రికార్డులను బద్దలు కొట్టింది.
అవెంజర్స్ -ది ఎండ్ గేమ్ చిత్రం రెండు వారాల్లోపే 2.2 బిలియన్ డాలర్లు వసూలు చేయడం ద్వారా 'టైటానిక్' రికార్డు బద్దలు కొట్టింది. ప్రస్తుతం 'అవెంజర్స్-ది ఎండ్ గేమ్' 2.78 బిలియన్ డాలర్లు వసూళ్లతో దూసుకెళుతోంది. లైఫ్ టైమ్ రన్‌లో 3 బిలియన్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.