»   » విలనిజాన్ని కూడా సెక్సీగా పండించిన ప్రియాంక చోప్రా (బేవాచ్ న్యూ ట్రైలర్)

విలనిజాన్ని కూడా సెక్సీగా పండించిన ప్రియాంక చోప్రా (బేవాచ్ న్యూ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజెల్స్‌: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ 'బేవాచ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె విలన్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ట్రైలర్స్ విడుదలయ్యాయి. అయితే వాటిలో ప్రియాంక కనిపించిన సీన్లు చాలా తక్కువ.

తాజాగా విడుదలైన 'బేవాచ్' కొత్త ట్రైలర్ లో ప్రియాంక చోప్రాకు సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో ఆమె విలనిజాన్ని కూడా ఎంతో సెక్సీగా పండించిందని స్పష్టమవుతోంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సెత్‌ గొర్డాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1990లో టెలివిజన్‌ సిరీస్‌గా ప్రసారమై 'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా అదే టైటిల్‌తో ఈ సినిమాను తీస్తున్నారు.

జాక్‌ ఎఫ్రాన్‌, కెల్లీ రోహ్రబాక్‌, అలెజాండ్ర దాద్రిరియో తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రం మే 25న ప్రేక్షకు ముందుకు రాబోతోంది. ప్రియాంక నటించింది కాబట్టి ఇండియాలో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

English summary
Baywatch | Trailer 3 released. BAYWATCH follows devoted lifeguard Mitch Buchannon (Johnson) as he butts heads with a brash new recruit (Efron). Together, they uncover a local criminal plot that threatens the future of the Bay. The film will be released by Paramount Pictures on May 25, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu