ఏంజెలీనా జోలీకి ఖరీదైన...బ్రా, అండర్‌వేర్ గిఫ్టు
ఏంజెలీనా జోలీ ఇటీవలే రొమ్మ క్యాన్సర్ రాకుండా సర్జరీ చేయించుకుని....తన రెండు స్తనాలను తొలగించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె పుట్టిన రోజున ఆమెను సంతోషంగా ఉంచడానికి వరల్డ్ బెస్ట్ బ్రాండ్లకు చెందిన బ్రాలు, అండర్ వేర్లు ఆమెకు కొనిచ్చాడట. ఇటీవల తన తాజా సినిమా 'వరల్డ్ వార్ జెడ్' చిత్ర ప్రీమియర్ షో పారిస్‌లో జరుగగా ఇద్దరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడే ఈ గిప్టు కొనిచ్చాడట.
రొమ్ము క్యాన్సర్ సర్జనీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏంజెలీనా జోలీ త్వరలో పలు సినిమాల్లో నటించడానికి సిద్దం అవుతోంది. కొన్నేళ్లుగా బ్రాడ్ పిట్‌తో సహజీవనం చేస్తున్న ఏంజెలీనా త్వరలో అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. త్వరలో అభిమానులు వీరి వివాహ వేడుకను చూడనున్నారు.
2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు దత్తత తీసుకున్న పిల్లలు కాగా, మరో ముగ్గురికి వారు జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications












