»   » హాలీవుడ్ నటిని పెళ్లాడబోతున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ

హాలీవుడ్ నటిని పెళ్లాడబోతున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి వివాహానికి బ్రిటన్ రాజకుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు బ్రిటన్‌కు రాజ కుటుంబం అఫీషియల్ ప్రకటన చేసింది. మేఘన్ మార్కెల్‌తో యువరాజు ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపిన రాయల్ ఫ్యామిలీ 2018లో వీరి వివాహం జరుగనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే వివాహ తేదీని ప్రకటించనున్నారు.

క్లారెన్స్ హౌస్ అధికారిక ప్రకటన

లండన్‌లోని రాజప్రసాదం క్లారెన్స్ హౌస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రిన్స్ హ్యారీ వివాహానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.

 16 నెలలుగా ప్రేమ వ్యవహారం

16 నెలలుగా ప్రేమ వ్యవహారం

ఫ్రెండ్స్ ద్వారా ప్రిన్స్ హారీ, మేఘన్ మార్కెల్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరూ గత 16 నెలలుగా ప్రేమ వ్యవహారంలో మునిగి తేలుతున్నారు. ఇద్దరి ఎఫైర్ గురించి అమెరికా, బ్రిటన్ మీడియా కోడై కూసింది.

 ప్రిన్స్ కంటే వయసులో పెద్ద

ప్రిన్స్ కంటే వయసులో పెద్ద

ప్రిన్సెస్ డయానా కుమారుడైన ప్రిన్స్ హ్యారీ వయసు 33 సంవత్సరాలు. మేఘన్ మార్కెల్ వయసు 36 సంవత్సరాలు. ప్రిన్స్ కంటే మార్కెల్ వయసులో 3 సంవత్సరాలు పెద్ద. 2016 జూన్ నుండి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు.

 మేఘన్ మార్కెల్‌కు ఇది రెండో వివాహం

మేఘన్ మార్కెల్‌కు ఇది రెండో వివాహం

మేఘన్ మార్కెల్ ఇంతకు ముందు ట్రెవర్ ఎంగెల్సన్‌ను పెళ్లాడింది. సినిమా నిర్మాత అయన ట్రెవర్ ఎంగెల్సన్‌‌తో 13 సంవత్సరాల మేఘన్ మార్కెల్‌కు పరిచయం అయింది. కొంతకాలం ప్రేమించుకున్న వీరు 2011లో వివాహం చేసుకుని 2013లో విడిపోయారు.

 కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో

కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో

వివాహం అనంతరం నటి మేఘన్ మార్కెల్‌ బ్రిటన్ రాజకుటుంబంలో సభ్యురాలు కానుంది. వివాహం తర్వాత ఈ జంట నాటింగ్ హామ్ కాటేజ్ లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో నివాసం ఉంటారని రాజకుటుంబం తెలిపింది.

English summary
Prince Harry is to marry American actress Meghan Markle, it has been announced, with the Royal family flocking to congratulate the couple. Clarence House confirmed the much-anticipated news that the Prince, 33, and his 36-year-old girlfriend are engaged in a statement on Monday morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu