»   » ఆమె ఫేస్ బుక్ పోస్ట్ చూసి...సిగ్గులేదా, బుద్దుందా,మనిషివేనా అంటూ తిట్లు

ఆమె ఫేస్ బుక్ పోస్ట్ చూసి...సిగ్గులేదా, బుద్దుందా,మనిషివేనా అంటూ తిట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది పోస్ట్ చేస్తే...నవ్వులు పాలవటం ఖాయం. ముఖ్యంగా ఎక్కువ మంది ఫాలో అయ్యే సెలబ్రెటీల సోషల్ మీడియా ఖాతాలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేకపోతే అందరూ వేలెత్తి చూపెడతారు. ఇప్పుడు అదే పరిస్దితి ఎదుర్కొంటోంది రియాలటి స్టార్ ఛోలి ఫ్రెర్రీ.

రీసెంట్ గా ఛోలి ఫెర్రీ ...తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతాలయిన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇనిస్ట్రగ్రామ్ లో తన నానమ్మతో కలిసి దిగిన ఫొటోని ఒకదాన్ని షేర్ చేసింది. ఆమె చనిపోయి బెడ్ పై ఉంటే ప్రక్కన నవ్వుతూ ఫోజిస్తూ ఫొటో దిగింది. పూర్తి మేకప్ తో ఉన్న ఆమె ముఖంలో ఎక్కడా విషాదం అనేది కనపడలేదు.

 Chloe Ferry branded "shameless" after sharing picture of sick grandmother in hospital bed

మా నానమ్మ ఆత్మకు శాంతించాలి అని రాస్తూ ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోని షేర్ చేసింది. ఈ ఫొటో చాలా మంది ఆమె అభిమానులకు కోపం తెప్పించింది. నువ్వు అసలు మనిషివేనా అని తిట్టిపోస్తున్నారు. ఓ ప్రక్కన చనిపోయి ఆవిడ ఉంటే..దాని ప్రక్కన నవ్వుతూ అదీ పూర్తి మేకప్ తో ఏదో షూటింగ్ కోసం ఫోజ్ ఇచ్చినట్లు ఫొటో దిగుతావా..దిగి ఆ ఫొటోని మమ్మల్ని అందరినీ చూడమని షేర్ చేస్తావా..సిగ్గులేదా అని తిట్టిపోసారు.

దాంతో ఈ నెగిటివ్ రెస్పాన్స్ చూసి ఖంగారుపడ్డ ఫెర్రీ వెంటనే ఆ పోస్ట్ తొలిగించింది. కానీ అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. చాలా మంది ఆ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెట్టి, ఆమెను ట్యాగ్ చేస్తూ తిట్టిపోస్తున్నారు. దాంతో ఇప్పుడేం చెయ్యాలో అర్దం కానీ సిట్యువేషన్ లో పడిపోయింది.

English summary
Chloe Ferry has been slammed as "shameless" for sharing a picture of her grandmother lying in a hospital bed. In the post, which has since been deleted, Chloe appeared to smile as she crouched next to her nan, who looks extremely ill as she lies in a hospital bed with an oxygen mask over her mouth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu