»   » ప్రముఖ దర్శకుడికి తీవ్ర గుండెపోటు.. హాస్పిటల్ బెడ్‌పై..

ప్రముఖ దర్శకుడికి తీవ్ర గుండెపోటు.. హాస్పిటల్ బెడ్‌పై..

Posted By:
Subscribe to Filmibeat Telugu
ప్రముఖ దర్శకుడికి తీవ్ర గుండెపోటు.. హాస్పిటల్ బెడ్‌పై...!

హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు కెవిన్ స్మిత్ తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. ఆయన పరిస్థితిని కుటుంబ సభ్యులు గుర్తించి హాస్పిటల్‌కు చేర్చడంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలోని హాస్పిటల్‌లో కోలుకొంటున్నాడు. కెవిన్ స్మిత్ దర్శకత్వం వహించిన క్లర్క్స్ చిత్రం బహుళ ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.

హాస్పిటల్ బెడ్‌పై

తీవ్ర గుండెపోటుకు గురై ఆస్పత్రిలో కోలుకొంటున్న కెవిన్ బెడ్‌పై నుంచే ఫొటో తీసి ట్విట్టర్‌లో పెట్టడం చర్చనీయాంశమైంది.

వైరల్‌గా ట్వీట్

వైరల్‌గా ట్వీట్

కెవిన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటోకు అనూహ్య స్పందన వచ్చింది. షేర్ చేసిన వెంటనే 177561 మంది లైక్ చేయగా, సుమారు 27 వేల మంది రీట్వీట్ చేశారు.

ఆ సమయంలో గుండెపోటు

ఆ సమయంలో గుండెపోటు

సాయంత్రం మొదటి ఆట ముగిసిన వెంటనే నాకు తీవ్రంగా గుండెపోటు వచ్చింది. నా ప్రాణాలను కాపాడటంలో వైద్యులు సఫలమయ్యారు. కానీ ఎల్‌ఏడీ ఆర్టెరీలో 100 శాతం బ్లాకేజ్ ఏర్పడింది అని వైద్యులు పేర్కొన్నారు అని ట్విట్టర్ ద్వారా కెవిన్ వెల్లడించారు.

క్యాన్సిల్ చేసుకోకపోతే..

క్యాన్సిల్ చేసుకోకపోతే..

రెండో ఆటను క్యాన్సిల్ చేసుకోకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు. ఖచ్చితంగా రాత్రే నేను చనిపోయేవాడిని. వైద్యుల కారణంగా నేను ఇంకా ప్రాణాలతో బతికి ఉన్నాను అని కెవిన్ పేర్కొన్నాడు.

English summary
Filmmaker Kevin Smith has revealed he almost died of a “massive heart attack” after rushing to a hospital on Sunday night. Smith, 47, shared the news on Twitter from is hospital bed in California.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu