twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో జేమ్స్ బాండ్ మూవీ, అర్దాంతరంగా తప్పుకున్న దర్శకుడు!

    By Bojja Kumar
    |

    ఎన్ని యాక్షన్ సినిమాలు వచ్చినా జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ప్రపంచ వ్యాప్తంగా బాండ్ సిరీస్ సినిమాలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు 24 సినిమాలు రాగా 2019లో 25వ మూవీ రాబోతోంది. గత రెండు సిరీస్‌లలో నటించిన డేనియర్ క్రెగ్ ఈ చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం క్రెగ్ స్థానంలో ఇడ్రిస్ ఎల్బాను తీసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు.

    తాజాగా సినిమాకు దర్శకుడిగా ఎంపికైన డానీ బోయల్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం చర్చనీయాంశం అయంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. నటీనటులతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది.

    2015లో వచ్చిన 'స్పెక్టర్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండిస్ దర్శకత్వంలోనే బాండ్ 25 మూవీ మొదలైంది. ఆ తర్వాత పలు కారణాలతో ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో డానీ బోయెల్ వచ్చినా ఆయన కూడా ఇపుడు తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకుడు లేడు. డిసెంబర్ నుండి షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా ఈ పరిణామాలు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి.

    Danny Boyle left from James Bond movie

    డానీ బోయెల్ స్థానంలో దర్శకుడిగా ఎవరు వస్తారు? అనేది చర్చనీయాంశం అయింది. నవంబర్ 2019లో సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. మరి ఇంకా దర్శకుడు ఫైనల్ కానందున సినిమా అనుకున్న సమయానికి వస్తుందా? లేదా? అనే విషయంలో అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి.

    English summary
    Michael G. Wilson, Barbara Broccoli and Daniel Craig today announced that due to creative differences Danny Boyle has decided to no longer direct Bond 25.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X