xXx మూవీలో దీపికా పదుకొన్.. పెళ్లి తర్వాత కూడా హాలీవుడ్ హీరోతో!
ఓ పక్క పెళ్లి వ్యవహారాలను చక్కబెడుతూనే దీపికా పదుకొన్ హాలీవుడ్‌లో అవకాశాలను చేజిక్కించుకొంటున్నది. ఇప్పటి వరకు xXx సిరీస్‌లో నటించి హాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ బాలీవుడ్ భామ ఇప్పుడు మరో వెర్షన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2017లో xXx ది రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ అనే చిత్రంతో దీపికా పదుకోన్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు వాన్ డీజిల్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా xXx సంబంధించిన నాలుగో సిరీస్‌లో నటించనున్నారనే విషయంపై ఆ చిత్ర దర్శకుడు డీజే కరుసో ధృవీకరించాడు.

xXx నాలుగో సిరీస్ చిత్రంలో దీపికా పదుకొన్ నటించనున్నారు. అందులో ఎలాంటి అనుమానాలు ఉండవు అని కరుసో వెల్లడించారు. ఈ చిత్రం చైనీస్ సింగర్, యాక్టర్ వాంగ్ యాన్ కూడా ఓ కీలకపాత్రను పోషించనున్నారు.
xXx ది రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. రెవెల్యూషన్ స్టూడియో రూపొందించిన అన్ని చిత్రాల కంటే ఈ సినిమా ఘన విజయం సాధించింది.

ప్రస్తుతం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌తో పెళ్లికి దీపికా పదుకొన్ సిద్ధమవుతున్నది. వీరి పెళ్లి నవంబర్ 20 తేదీన జరిపించేందుకు ముహూర్తం ఖారారు చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











