»   » కండల వీరుడు ‘ది రాక్’ రోజూ ఏం తింటాడో తెలుసా?

కండల వీరుడు ‘ది రాక్’ రోజూ ఏం తింటాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఒకప్పటి డబ్ల్యుడబ్లుఎఫ్ ఫైటర్, ప్రస్తుత హాలవుడ్ స్టార్ ది రాక్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. రాక్ అసలు ద్వేన్ జాన్సన్. 42 సంవత్సరాల రాక్....అదిరిపోయే కండలతో హాలీవుడ్ సినిమాల్లో తనదైన యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

సినిమా ద్వారా రాక్ ఏడాదికి దాదాపు రూ. 300 కోట్ల సంపాదిస్తున్నాడు. ది రాక్ ఇటీవల విడుదలైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6, జి ఐ జ్యోస్, ఎంపైర్ స్టేట్, హెరిక్యూలస్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 లాంటి హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. రాక్ ను చూసిన అభిమానులు ఆ రేంజిలో..కండలు, శరీర సౌష్ఠవం కోసం ఏం తింటాడు అనే సందేహం రావడం సహజమే.

Dwayne johnson diet plan

తన డైట్ విషయంలో అభిమానుల్లో నెలకొన్న ఈ సందేహాలను రాక్ స్వయంగా నివృత్తి చేసారు. ప్రతిరోజు 284 గ్రాములు కాడ్‌ చేప ముక్కలు తీసుకుంటానని వెల్లడించాడు. ప్రతిరోజు 6 కప్పుల రైస్‌, రోజూ మూడు కప్పుల వెజిటబుల్స్‌, రోజూ ఉదయం చేపలతో పాటు 2 కోడిగుడ్లను ఆమ్లెట్‌గా వేసి తీసుకుంటాను అని వెల్లడించారు.

అదే విధంగా... రాత్రి పడుకునే ముందు 10 ఎగ్‌వైట్‌లను ఆమ్లెట్‌గా తింటాను. వీటికి అదనంగా 226 గ్రాముల బీఫ్‌(ఎద్దుమాంసం), 680 గ్రాముల బంగాళదుంపలు తీసుకుంటాను. ఫైనల్‌గా సుమారు 900 గ్రాముల గాటోరెడ్‌ తీసుకుంటాను అని రాక్ చెప్పుకొచ్చారు. రోజూ మొత్తంలో దాదాపు 7 సార్లు ఈ హారాన్నిన్యూట్రీషియన్ సూచనల మేరకు తీసుకుంటాడు. వీటితో పాటు రోజూ ఫిట్ నెస్ నిపుణుల సమక్షంలో వ్యాయామాలు చేస్తుంటాడు.

English summary
Dwayne Johnson shares the meal plan that gets his physique in bodybuilder shape.
Please Wait while comments are loading...